Alia Bhatt: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఈ బ్యూటీ త్వరలో ఒక అడల్ట్ మూవీ చేయబోతోంది. ఈ సినిమాను 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే చూసేలా అడల్ట్ కంటెంట్ తో రూపొందించనున్నారు. ఇలాంటి సినిమాలో అలియా మొదటిసారి కనిపించబోతోంది. అయితే ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ చేయడం లేదు. పాపులర్ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ వారు నిర్మించబోయే ఓటిటి ప్లాట్ ఫార్మ్ మూవీ. ఈ సినిమా కోసం అలియా పెద్ద రిస్కు తీసుకోవడానికి సిద్ధమైంది.
ఈ మూవీ డీటెయిల్స్ గనక ఒకసారి పరిశీలిస్తే, ఈ మూవీకి అలియా భట్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. అలియా నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో చాక్ బోర్డ్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రొడక్షన్ పార్ట్‌నర్ గా కొలాబిరేట్ చేసుకొని నిర్మించబోతుంది. దీని ద్వారా శ్రీతి ముఖర్జీ దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.
Also Read – Pakistan: కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన దార్..!
బ్రహ్మాస్త్ర, వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీకి శ్రీతి ముఖర్జీ బంధువు. దీని వెనక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అలియా భర్త.. రణబీర్ కపూర్ నటించిన క్లాసిక్స్ లో వేక్ అప్ సిద్ మూవీ అలియాకు బాగా ఇష్టం. ఈ సినిమాను స్క్రీన్ ప్లే మార్చి అమ్మాయిల కోణంలో కాస్త బోల్డ్ గా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందీ..? అనే ఆలోచనని బ్రహ్మస్త్రకు అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీతి ముఖర్జీతో చెప్పింది అలియా. ఈ ఐడియాకి బాగా ఎగ్జైట్ అయిపోయి ఈ స్టోరీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ భాగం కొత్త నటీనటులతో తెరకెక్కించబోతున్నారట.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంబించాలని ప్లాన్ చేస్తున్నారట ఆలియా బృందం. 2022లో డార్లింగ్స్ సినిమాతో అలియా నిర్మాతగా మారింది. ఆమె తల్లి సోని రజ్డాన్ దర్శకత్వం వహిస్తున్న ‘డిఫికల్ట్ డాటర్స్’ అనే మరో కొత్త సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉన్న అలియా.. వచ్చే ఏడాది మార్చిలో భర్త రణబీర్ తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్న లవ్ అండ్ వార్ మూవీతో రాబోతోంది. అలాగే, ప్రభాస్ కల్కి 2 కోసం కూడా నాగ్ అశ్విన్ అలియాను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక అలియా నటించబోయే ఈ బోల్డ్ మూవీ తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read – Pooja Hegde: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్..!


