SIIMA 2025: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సీనియర్ నిర్మాతల్లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్‌ను కూడా స్టార్ట్ చేసి మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాలకు పెద్ద పీట వేస్తూ విజయాలను దక్కించుకుంటున్నారు. సినిమా మేకింగ్‌లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అరవింద్ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే సైమా (SIIMA) 2025 ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో ఏడు విభాగాలలో పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే. ఈ గొప్ప విజయాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని, కానీ అలా జరగలేదని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ జాతీయ అవార్డుల గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగులో కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చాయి. ఏడు అవార్డులకి ఇండస్ట్రీస్ స్పందించక ముందే, సైమా వారు స్పందించి వారందరినీ ఒక స్టేజి మీదకి తీసుకువచ్చి, వాళ్లను సత్కరించాలి అనుకోవడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గది’ అని ఆయన SIIMA ప్రయత్నాన్ని ప్రశంసించారు.
అల్లు అరవింద్ జాతీయ అవార్డులు (National Awards) దక్కించుకున్న విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మనకు 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనిని మనం ఒక పండగగా జరుపుకోవాలి. కానీ ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్లదే’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో ఐకమత్యం లేదని స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టు అయ్యాయి. సాధారణంగా పరిశ్రమలో ఐకమత్యంగా ఉండాలని అది ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కానీ అల్లు అరవింద్ తాజాగా చేసిన కామెంట్స్ చూస్తుంటే టాలీవుడ్‌లోని విబేదాలను మరోసారి తేటతెల్లం చేశాయి.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/alia-bhatt-green-signal-for-adult-movie/
రీసెంట్‌గా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ (Geeta Arts) సంస్థ విడుదల చేయగా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మూడు వందల కోట్ల మైలురాయిని అందుకునే దిశగా అడుగులేస్తోంది.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/pooja-hegde-shocking-comments-on-bollywood/


