Allu Sirish Engagement: అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. శిరీష్ ఎంగేజ్‌మెంట్ నయనికతో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో అల్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మెగా హీరోలు కూడా పాల్గొన్నారు.
చిరంజీవి – సురేఖ, రామ్‌చరణ్ – ఉపాసన, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్‌తో మెగా హీరోలందరూ ఈ వేడుకలో సందడి చేశారు. డిప్యూటీ సీఏం బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం శిరీష్ ఎంగేజ్‌మెంట్‌కు రాలేకపోయారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా అటెండ్ అయ్యారు.
అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. శిరీష్, నయనికలతో అల్లు అర్జున్ – స్నేహారెడ్డి, రామ్‌చరణ్ – ఉపాసన కలిసి ఓ ఫొటో దిగారు. మరో ఫొటోలో అల్లు అరవింద్, సురేఖలతో కలిసి రామ్‌చరణ్, బన్నీ ఫొటోలకు ఫోజులిచ్చారు. చాలా రోజుల తర్వాత బన్నీ, చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ స్టార్ హీరోల అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.
Also Read – Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ!
చిరంజీవి, అల్లు అరవింద్ ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉపాసన సీమంతం వేడుక తాలూకు వీడియోను మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించలేదు. దాంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు నిజమేనని అంతా అనుకున్నారు. కానీ శిరీష్ ఎంగేజ్‌మెంట్‌తో ఈ పుకార్లకు అల్లు, మెగా ఫ్యామిలీస్ పుల్‌స్టాప్ పెట్టారు. ఎంగేజ్‌మెంట్ వేడుకలో పాల్గొనడమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలను షేర్ చేశాడు రామ్‌చరణ్. శిరీష్, నయనికలకు కంగ్రాట్స్ చెప్పాడు.
శిరీష్ ఎంగేజ్‌మెంట్ తర్వాత నయనిక గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. నయనిక బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ఆమె తండ్రి ఎవరంటూ ఆరాలు తీస్తున్నారు. నయనిక పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అని సమాచారం. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారట. రెండు కుటుంబాల మధ్యే కాకుండా శిరీష్‌కు నయనికకు మధ్య చాలా కాలంగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడటంతో పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు చెబుతున్నారు.
గౌరవం మూవీతో 2013లో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శిరీష్, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివోతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. గత ఏడాది రిలీజైన బడ్డీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
Also Read – Mass Jathara Review: ‘మాస్ జాతర’తో అయినా రవితేజ సక్సెస్ కొట్టాడా?


