Saturday, June 7, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది

Allu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) అభిమానులకు క్రేజీ న్యూస్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోలో దీపికాతో కూడా VFX సీన్స్ షూట్ చేశారు. ఆమె లుక్స్ బట్టి ఇది పీరియాడిక్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది.

స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, అవతార్, రోబో మూవీల తరహాలో కొత్త టెక్నాలజీని వాడుకుని ఈ మూవీ చేయనున్నారు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని ఇందులో కేవలం గ్రాఫిక్స్ కే దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీంతో అభిమానుల ఊహలకు అందని రీతిలో హాలీవుడ్ తరహాలో విజువల్స్‌ ఉండనున్నాయని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తీసిన ’జవాన్’ సినిమాతో బ్లాక్‌బాస్టర్ అందుకున్నాడు అట్లీ. ఆ మూవీ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఇండస్ట్రీ హిట్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News