టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) స్నేహితుడు, ‘గంగం గణేశా’ సినిమా నిర్మాత కేదార్ సెలగంశెట్టి(Kedar Selagamsetty) మృతి చెందారు. కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి కారణం తెలియరాలేదు. నిర్మాత బన్నీ వాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండకు ఈయన సన్నిహితుడు.
- Advertisement -
ఆయన నిర్మించిన ‘గంగం గణేశా’ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా.. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే గెటప్ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ అనే సినిమాను కూడా నిర్మించారు.