Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప ఫ్రాంఛైజీస్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన బన్నీ ఇప్పుడు ఏకంగా అంతకుమించిన భారీ చిత్రంతో రాబోతున్నారు. ఇక అట్లీ ఇప్పటి వరకూ తీసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ, వండర్‌ఫుల్ డైరెక్టర్‌గా ఇటు సౌత్, అటు నార్త్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
టెక్నికల్‌గా హైలీ టాలెంటెడ్ అని బలంగా నమ్మిన బన్నీ మన టాలీవుడ్ దర్శకులను కూడా పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే, అల్లు అర్జున్, దీపిక పడుకోణ్‌ల డిస్కర్షన్ వీడియోస్‌ని రిలీజ్ చేసి ఒక్కసారిగా భారీ హైప్‌ని క్రియేట్ చేశాడు అట్లీ. దీనికి కారణం ఈ వీడియోలలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కనిపించడమే.
Also Read- Shraddha Das: నాలుగు పదుల వయస్సులోనూ సెగలు రేపుతున్న శ్రద్ధ.. హాట్ పిక్స్ వైరల్..!
మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో షాకిచ్చిన బన్నీ?
ఈ భారీ చిత్రానికి హాలీవుడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం హీరో అండ్ డైరెక్టర్ షాకిచ్చినట్టుగా తాజాగా వైరల్ అవుతున్న పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ నుంచి మన సౌత్‌లో క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎస్ ఎస్ థమన్ వరకూ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. దేవీశ్రీప్రసాద్, థమన్ ఆల్రెడీ బన్నీకి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అలాంటిది వీరందరినీ కాదని ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సీనియర్స్‌ని కాదని ప్రయోగం..
ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్యూడ్ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. తాజాగా అల్లు అర్జున్, సాయి అభ్యంకర్‌కి బర్త్ డే విషెస్ చెప్తూ.. ‘‘నా ప్రియమైన సోదరుడు ఎస్ఎకె మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.. మీ అందరికీ రాబోయే సంవత్సరం మంచి విజయం, పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటున్నాను’’.. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీనితో అల్లు అర్జున్, అట్లీ సినిమాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్ అని బన్నీ హింట్ ఇచ్చినట్టుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి, ఇది అఫీషియల్‌గా ఎంతవరకూ కన్‌ఫర్మ్ అనేది మేకర్స్ ప్రకటించేవరకూ వేచి చూడాలి.
Also Read- Kamal Haasan: రజినీకాంత్‌తో సినిమాపై కమల్ హాసన్ బిగ్ ట్విస్ట్ – ఈ వీక్‌లోనే అనౌన్స్‌మెంట్?


