అందాల యాంకర్ అనసూయ మామూలు క్రేజ్ లేదు. జబర్దస్త్తో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు స్టార్ నటిగా ఎదిగింది. వయసు పెరిగినా అందంతో అలరిస్తూనే ఉంది.
‘రంగస్థలం’ సినిమాతో అనసూయ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటి నుంచి ఆమె బుల్లితెరను వదిలేసి వెండితెరపై ఎక్కువగా బిజీగా మారింది.
యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ను ఆరబోస్తూ ఫొటోలు విడుదల చేస్తోంది.
తాజాగా అనసూయ జబర్దస్త్ స్టేజ్ పై మెరిసింది. ఈ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనసూయ ఈ ఈవెంట్లో పాల్గొంది. అయితే ఇంతకు ముందు ఉన్నవారంతా మరోసారి కలుస్తుండడంతో ఆ వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది.