Anushka – Tamannaah: ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన బాహుబలి అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులు మొత్తం తిరగరాసింది. తెలుగు సినిమా స్థాయిని బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనేలా చేసింది. తెలుగు సినిమా స్టామినాను పాన్ ఇండియన్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఫస్ట్ మూవీగా బాహుబలి నిలిచింది. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా అన్నీ భాషల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
650 కోట్ల కలెక్షన్స్…
ప్రభాస్ యాక్టింగ్, ఎలివేషన్లు, రాజమౌళి టేకింగ్‌కు పాన్ ఇండియన్ ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయ్యారు. 650 కోట్ల వసూళ్లను రాబట్టిన ఫస్ట్ తెలుగు మూవీగా బాహుబలి హిస్టరీని క్రియేట్ చేసింది. బాహుబలి ది బిగినింగ్ మూవీ 2015 జూలై 10న రిలీజైంది. గురువారం నాటికి ఈ సినిమా రిలీజై సరిగ్గా పదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా బాహుబలి మేకర్స్ మళ్లీ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.
Also Read – Meenaakshi Chaudhary: జీన్స్‌లో కవ్వెక్కిస్తున్న మీనాక్షి చౌదరి
ప్రభాస్ స్టైలిష్ లుక్…
ఈ రీ యూనియన్ మీట్‌కు ప్రభాస్ కూడా హాజరయ్యాడు. కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ రీ యూనియన్ సంబరాల్లో రానా, రమ్యకృష్ణ, నాజర్‌తో పాటు ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లు, సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొన్నారు. కీరవాణి కూడా రీ యూనియన్‌లో కనిపించాడు.
అనుష్క, తమన్నా మిస్సింగ్…
కానీ బాహుబలి హీరోయిన్లు అనుష్క, తమన్నా మాత్రం రీ యూనియన్ మీట్‌లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ డిజపాయింట్ అయ్యారు. వారిద్దరి మిస్సింగ్‌కు కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు హీరోయిన్లకు రీ యూనియన్ మీట్‌కు ఆహ్వానం అందలేదని కూడా కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
షూటింగ్ బిజీతోనే…
ప్రస్తుతం అనుష్క మలయాళ మూవీ షూటింగ్‌లో ఉందని అందుకే ఈ వేడుకకు ఆమె హాజరు కాలేదని చెబుతోన్నారు. అనుష్క బయట కనిపించి చాలా కాలమైంది. ఏ ఈవెంట్స్‌కు హాజరుకావడం లేదు. చివరకు తాను హీరోయిన్‌గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉందని, వాటి వల్లే అనుష్క బాహుబలి రీ యూనియన్‌కు అటెండ్ కాలేదని మరికొందరు పేర్కొంటున్నారు. అసలు అనుష్క, తమన్నాలకు ఆహ్వానమే పంపలేదని ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లలో నిజానిజాలేమిటన్నది సస్పెన్స్‌గా మారింది.
రీ రిలీజ్…
బాహుబలి ప్రేక్షకుల ముందుకొచ్చి పదేళ్లు అయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. రెండు పార్ట్‌లను ఒకటిగా చేస్తూ అక్టోబర్ 31న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.


