Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభDarshan: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు.. హీరోపై చెప్పుతో దాడి

Darshan: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు.. హీరోపై చెప్పుతో దాడి

- Advertisement -

Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. అభిమానులు D బాస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. త్వరలో దర్శన్ క్రాంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. దీంతో దర్శన్, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల దర్శన్ ఓ ఇంటర్వ్యూలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అందరూ అదృష్ట దేవత అని మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తారు, ఎప్పుడు వెళ్లిపోతుందో అని భయపడతారు. ఈ సారి ఆ అదృష్ట దేవత వచ్చినప్పుడు పట్టుకొని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి, బట్టలు తీసేసి ఉంచాలి. బట్టలు లేకుండా బయటకి వెళ్ళలేదు కదా, అప్పుడు అదృష్ట దేవత మనతోనే ఉంటుంది కదా అని అన్నాడు దర్శన్. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

పలు మహిళా సంఘాలు, హిందూ సంఘాలు దర్శన్ పై తీవ్ర విమర్శలు చేశారు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా దర్శన్ తన క్రాంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొనగా ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ వ్యాఖ్యల విషయంలో దర్శన్ క్షమాపణ చెప్పాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో దర్శన్ పై దాడిని పలువురు కన్నడ నటులు ఖండిస్తూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News