Avatar 2 : జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. 13 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ సినిమా రాబోతుంది. అవతార్ పార్ట్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి.
ఇంతటి ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాని ఒకచోట బ్యాన్ చేశారు తెలుసా. అవతార్ 2 సినిమాని మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో బ్యాన్ చేశారు. తాజాగా అవతార్ 2 సినిమాని కేరళలో నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
అసలు ఎందుకు బ్యాన్ చేశారంటే.. సాధారణంగా థియేట్రికల్ బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయంలో ఎగ్జిబిటర్స్ 50 శాతం షేర్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తుంటారు. అవతార్ సినిమాకి హైప్ ఎక్కువగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ 60 శాతం వరకు కావాలని అడగడంతో ఎగ్జిబిటర్స్ ఒప్పుకోలేదు. కొన్ని చర్చల అనంతరం ఎగ్జిబిటర్స్ 55 శాతం ఇస్తామన్నారు. అయినా డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోకపోవడంతో ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ తమ పరిధిలో ఉన్న 400 థియేటర్స్ లో అవతార్ 2 సినిమాని రిలీజ్ చేయము అంటూ నిషేధించింది. మరి సినిమా టైంకి మళ్ళీ చర్చలు జరిగి సఫలం అయి కేరళలో సినిమా రిలీజ్ అవుతుందేమో చూడాలి.