Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh: ఏ సినిమాను నిర్మించడం లేదు.. ఇబ్బంది పెట్టకండి!

Bandla Ganesh: ఏ సినిమాను నిర్మించడం లేదు.. ఇబ్బంది పెట్టకండి!

Bandla Ganesh: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుగా పరిచయమై, ఆ తర్వాత నటుడిగా, అగ్ర నిర్మాతగా, పవన్ కళ్యాణ్ భక్తుడిగా పాపులర్ అయ్యాడు బండ్ల గణేష్. ‘టెంపర్’ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాతగా కనిపించలేదు. నటుడిగా మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మళ్ళీ కమెడియన్‌గా కనిపించాడు. కానీ, ఆ పాత్ర గణేష్‌ని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి.

- Advertisement -

ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. కానీ, సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం గెస్ట్‌గా వచ్చి వార్తల్లో నిలుస్తున్నాడు. అప్పుడెప్పుడో పూరి జగన్నాధ్ గురించి ఓపెన్‌గా మాట్లాడి హైలెట్ అయ్యాడు. మొన్నా మధ్య అల్లు అరవింద్‌ని ఉద్దేశించి మాట్లాడి ట్రోల్స్ కి గురైయ్యాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌కి వచ్చిన బండ్ల గణేష్.. పేరు ప్రస్తావించకుండా విజయ్ దేవరకొండ‌ని ఇమిటేట్ చేస్తూ చేసిన పలు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read- Naveen Polishetty: చిరు, పవన్ దారిలో నవీన్ పోలిశెట్టి.. సక్సెస్ అవుతాడా?

కిరణ్ అబ్బవరంని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చి గొప్ప స్థాయికి వస్తావని పొగడ్తలతో ముంచేశాడు. అంతేకాదు, ఇప్పటికే.. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడని కొనియాడారు. ఈ సందర్భంగా విజయ్ గురించి చేసిన కామెంట్స్ విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాను నిర్మించాలనే ఆశతో విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే, అందుకు విజయ్ రెస్పాండ్ అవలేదని.. ఆ విషయంలో హర్ట్ అయ్యే ఇలా మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది.

దీంతో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వదలుచుకున్న బండ్ల గణేష్ స్వయంగా పోస్ట్ పెట్టాడు. ఇందులో.. ‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Also Read- Shraddha Das: నాలుగు పదుల వయస్సులోనూ సెగలు రేపుతున్న శ్రద్ధ.. హాట్‌ పిక్స్‌ వైరల్..!‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad