Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh: టాలీవుడ్ ప్రముఖులపై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖులపై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh| నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని మొహమాటం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారు. దీని వల్ల ఆయనను అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఎక్కువయ్యారు.

- Advertisement -

గతంలో ఏపీ మాజీ మంత్రి రోజాపై తీవ్రంగా విరుచుకుడిన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మందు, తర్వాత కూడా మాజీ సీఎం కేసీఆర్(KCR) కుటుంబంపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawankalyan), గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) లాంటి హీరోలు కూడా రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు. అయితే కొంతమంది హీరోలు, ఇతర ప్రముఖులు విష్ చేయలేదు. దీనిపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

“గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు.తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వైరల్‌లా మారింది. ఎవరినీ ఉద్దేశించి ఆయన ఈ పోస్టు పెట్టారో అంటూ చర్చ మొదలైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News