Sreeleela: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కే ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది. సక్సెస్‌ను బట్టే నేమ్, ఫేమ్ వస్తాయి. కానీ కొందరు హీరోయిన్లకు ఈ రూల్ వర్తించదు. ఒక్క సక్సెస్ లేకపోయినా అందాల ముద్దుగుమ్మలకు అవకాశాలకు కొదవ ఉండదు. భాగ్యశ్రీ బొర్సేనే అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిలుస్తోంది.
మిస్టర్ బచ్చన్‌తో…
రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈ సినిమాలో జిక్కీ పాత్రలో తన గ్లామర్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో భాగ్యశ్రీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది.
Also Read – Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..
అఖిల్ లెనిన్‌లో…
తాజాగా మరో బంపరాఫర్‌ను అందుకున్నది. అఖిల్ అక్కినేని (Akhil Akkinenei) హీరోగా నటిస్తోన్న లెనిన్ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఛాన్స్ దక్కించుకున్నది. తొలుత ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను సెలెక్ట్ చేశారు మేకర్స్. అఫీషియల్‌గా అనౌన్స్ చేయడమే కాకుండా శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, గ్లింప్స్ సైతం రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీలీల తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నది. డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ సమస్యల వల్ల లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా లెనిన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు మేకర్స్ శ్రీలీలపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను రీ షూట్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ వేరే ఛాన్స్ లేక రీ షూట్స్ చేస్తున్నారు.
కింగ్‌డమ్‌లో కూడా…
శ్రీలీల వదులుకున్న సినిమాలో భాగ్యశ్రీ నటించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో తొలుత శ్రీలీలనే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌లోనూ శ్రీలీల పాల్గొన్నది. కానీ షూటింగ్ డిలే వల్ల శ్రీలీల ఈ సినిమా నుంచివైదొలగడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు మేకర్స్. శ్రీలీల వదులుకున్న రెండు సినిమాల్లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించడం ఆసక్తికరంగా మారింది.
Also Read – Kavitha vs Mallanna: కవిత మల్లన్న సమస్యపై తొలిసారి స్పందించిన BRS.. ఏమందంటే?
ఆంధ్రా కింగ్ తాలూకా…
కింగ్‌డమ్ (Kingdom), లెనిన్‌తో (Lenin) పాటు తెలుగులో రామ్ పోతినేని (Ram Pothineni) ఆంధ్రా కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ కాంతాలో హీరోయిన్‌గా నటిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. కింగ్‌డమ్ మూవీ జూలై 31న రిలీజ్ కాబోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ తుది దశకు చేరుకుంది.


