Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే. అన్నయ్య ఒక్క స్టెప్ వేస్తే చాలు థియేటర్స్ అన్నీ ఈలలతో మోత మోగాల్సిందే. ఇక కామెడీ టైమింగ్ లో చిరుని మించినవాళ్ళే లేరు. ఇలాంటి కామెడి సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి ఇద్దరు దర్శకులను కాచి వడబోస్తే అనిల్ రావిపూడి వచ్చినట్టుంది.. అని ఆయన సినిమాలలో కామెడీ చూస్తే చెప్పుకోవాల్సిందే.
మొదటి సినిమా పటాస్ తోనే అనిల్ రావిపూడి మార్క్ ఎలా ఉంటుందో చూపించారు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో అనిల్ రావిపూడి వరుస హిట్స్ అందుకున్నారు. ఇటీవల కాలంలో ఫ్లాప్ అంటే తెలియని దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి నిలిచారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ లాంటి రెండు జనరేషన్ హీరోలతో మల్టీస్టారర్ తీసి హిట్ కొట్టడం అంటే అంత ఈజీకాదు. కానీ, ఈ విషయంలో కూడా అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు.
Also Read – Personal Loan: పద్దాకా జాబ్స్ మారుతున్నారా..? అయితే మీకు లోన్ రావటం కష్టమని తెలుసా..!
ఈ సక్సెస్ ట్రాక్ చూస్తే ఏ హీరో అయినా అనిల్ కి కథ వినకుండా ఛాన్స్ ఇవ్వాల్సిందే. అలాగే, మెగాస్టార్.. అనిల్ కి ఛాన్స్ ఇచ్చారు. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకి ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అంతేకాదు, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీ జీ స్టూడియోస్ వారు శాటిలైట్ తో పాటు ఓటీటీ రైట్స్ ని కూడా దక్కించుకున్నట్టు సమాచారం.
ఈ మూవీకి భారీ స్థాయిలో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందట. ఇప్పటి వరకూ మెగాస్టార్ కెరీర్ లో జరగని హై రేంజ్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా బిజినెస్ జరిగిందట. ఇతర ఓటీటీ, శాటిలైట్ వారు పోటీ పడినప్పటికీ అనిల్ రావిపూడి ప్రస్తుతం జీ వారితో ఓ షో చేస్తున్న కారణంగా జీ స్టూడియోస్ వారికే ఈ మూవీ హక్కులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం అనే ట్యాగ్ లైన్ తో 2026 సంక్రాంతికి రఫ్ఫాడించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
Also Read – Gold Rate Rally: రెండు వారాల గరిష్ఠానికి గోల్డ్.. బంగారాన్ని ఆవరించిన డాలర్ బలహీనత ప్రభావం..!!


