Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGovinda: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద్‌కు అస్వస్థత

Govinda: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద్‌కు అస్వస్థత

Govinda| ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముక్తానగర్, బోద్వాడ్, పచోరా, చోప్డాలో ప్రచారం చేసేందుకు గోవింద జలగావ్ చేరుకున్నారు. ఆయనకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. పచోరాలో రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో గోవింద ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో రోడ్డు షోను సగంలోనే ఆపేసి ముంబై వెళ్లిపోయారు. అయితే అతడికి ఛాతిలో నొప్పి వచ్చినట్లు సమాచారం. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా వీల్ చైర్‌పై గోవింద కనిపించాడు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

- Advertisement -

కాగా గత నెలలో గోవింద ప్రమాదవశాత్తూ కాల్పులకు గురైన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు గోవిందకు సూచించారు. ఇటీవలే సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. గోవింద మరోసారి అనారోగ్యానికి గురైన సంగతి తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad