ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ కావ్య, రాజ్‌ల కార్‌లో ఉన్న బ్యాగ్‌ని దొంగిలించమని కిరాయి రౌడీకి చెప్తాడు. అలా కార్‌లో వెళ్తున్న రాజ్‌కి ఎక్కిళ్లు వస్తే కార్ పక్కన ఆపి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి రాజ్ వెళ్తే ఈలోపు ఆ రౌడీ వచ్చి కార్‌లోని బ్యాగ్‌ని లాక్కొని పోయి రాహుల్ కార్ దగ్గర పాడేస్తాడు. కావ్య బ్యాగ్ బ్యాగ్ అని అరిస్తే రాజ్ ఆ రౌడీని పట్టుకుని గట్టిగా నాలుగు పీకుతాడు. డబ్బు ఎక్కడ ఉంది ఎవరు చేయించారు ఈ పని నీతో అని అడిగితే ఆ రౌడీ గాడు రాహుల్ చేయించాడని చెప్తాడు.
వెంటనే రాజ్ ఇంటికి వెళ్దాం పదా అంటే కావ్య నాకు వేరే పని ఉంది మీరు వెళ్లండి అంటుంది. రాజ్ ఇంటికి వెళ్లగానే రాహుల్‌ని పిలిచి నాలుగు పీకి ఇన్నాళ్లు తమ్ముడిలా చూసాను ఇలా చేస్తావా అని ఎందుకు చేశావు డబ్బు ఎక్కడ అని అడుగుతాడు. ఇంట్లో అందరూ ఆపినా ఆగకుండా రాజ్ కొడుతూ ఉంటాడు. రుద్రాణి ఆపి చంపేస్తావా అని అరుస్తుంది. రాజ్ నా దగ్గర రూ.2 కోట్లు కొట్టేసాడు అంటే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. రాహుల్‌ని నిలదీసినా ఏమి చెప్పకపోయే సరికి రుద్రాణి నీ దగ్గర పొద్దున్న డబ్బు అడిగితే లేవు అన్నావు ఇప్పుడు రాహుల్ నీ డబ్బు కొట్టేసాడు అంటున్నావు ఏది నిజం చెప్పు అని అడుగుతుంది. అదే మాట ఇంట్లో అందరూ అడిగితే నా దగ్గర డబ్బు ఉంది అని రాజ్ చెప్తాడు.
మరి పొద్దున్న ఆ షేర్స్ వాళ్లు వచ్చి డబ్బు అడిగితే లేవు అన్నావు అని ఊరుకున్నావు అని నిలదీస్తుంది. ఈలోగా కావ్య ఆ ఫేక్ షేర్స్ దొంగలను తీసుకొచ్చి మొత్తం నిజం బయటపెడుతుంది. వాళ్లని చూసి రుద్రాణి షాక్ అవుతుంది. రూ.500 లకు బేరం పెట్టి నాటకం ఆడించిన సంగతి కావ్య బయటపెడుతుంది. సినిమాలో క్యారెక్టర్లు వేసుకునే వాళ్లని తీసుకొచ్చి ఇంట్లో డబ్బుల కోసం నాటకాలు మొదలు పెట్టిందని ఇంట్లో అందరూ ఛీ కొడతారు. ఈ నాటకాలు అన్నీ ఎందుకు చేస్తున్నావని ఇంట్లో అందరూ నిలదీసినందుకు రుద్రాణి నా గురించి మీ నిజం బయటపడింది.
నేను ఇదంతా కావాలనే చేసాను ఈ రాజ్, కావ్య వాళ్లు సెటిల్ అవ్వడానికి మాత్రమే చూస్తారు ఇంట్లో వాళ్లకి చిల్లర పెడుతూ వీళ్లు కోట్లతో విలాసాలు చేస్తున్నారు అని ఆ డబ్బు తీసుకొచ్చి బయటపెడుతుంది. మా దగ్గర డబ్బు లేవు అంటే మీకు ఇవ్వకుండా మేము మాత్రమే వాడుకుంటున్నాము అని కాదు. కంపెనీని కాపాడటానికి ఈ డబ్బు దాస్తున్నాము మేము తినేయడానికి కాదు అని రాజ్ చెప్తాడు. మూడు నెలలు టైం అడిగాము కదా అప్పటి వరకూ ఆగండి అప్పుడు చెప్తాము అని చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతూ ఇంకొక ప్లాన్‌లకు సిద్దం అవుతుంది.. తర్వాత స్వప్నకు నొప్పులు వస్తుంటాయి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది..