Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi February 7th Episode: స్వప్న కూతురు బారసాలలో రుద్రాణి, అనామిక కుతంత్రాలు..

Brahmamudi February 7th Episode: స్వప్న కూతురు బారసాలలో రుద్రాణి, అనామిక కుతంత్రాలు..

ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు పోలీస్ డ్రెస్‌లో కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య చాలా సంతోష పడుతుంది. కానీ రుద్రాణి మాత్రం బాగుంది దసరా వేషం అని ఆటపట్టిస్తుంది. అలాంటి వేషాలు మీరు వేస్తారు నా చెల్లి కాదు అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ అత్తని పోలీస్ స్టేషన్‌లో పెట్టడానికా అంటుంది. కళ్యాణ్ సమాధానం చెప్పే సరికి నోరు మూస్తుంది. ఇంట్లో అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత అపర్ణ మీరు అనుకున్నది సాధించారు కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవాలి అని అడుగుతుంది మధ్యలో రుద్రాణి నువ్వు బాగానే అడిగావు కానీ కళ్యాణ్ ఒప్పుకోవాలి గా అంటుంది. కళ్యాణ్ ఈ ఇంట్లో మా అమ్మతో పాటూ ఇంకా కొంతమందికి ఇష్టం లేదు అందరూ ఒప్పుకున్నాక వస్తాము అంటాడు.

- Advertisement -

ఇందిరాదేవీ స్వప్న కూతురుకి బారసాల చేస్తున్నాము ఇక్కడే ఉండి రేపు అది అయ్యాక వెళ్లండి అంటుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆరుబయట కూర్చుని పూల మాలలు కడుతూ సరదాగ చిన్నప్పటి విషయాలు అన్ని మాట్లాడుకుంటారు. పాప ఏడుస్తుందని స్వప్న వెళ్తే ఏడుపు ఆపకుండా ఎంత జో కొట్టిన ఆపదు పాప. అప్పుడు కావ్య నేను ఏడుపు ఆపుతా అని పాటలు మొదలు పెట్టేస్తుంది.. అప్పుడు స్వప్న నిజమే కావ్య బిడ్డని ఆడించడానికి తల్లే అక్కర్లేదు నీలా మంచి మనసు ఉన్నవాళ్లు చాలు అంటుంది. దూరం నుంచి అపర్ణ, ఇందిరా దేవీ ఇదంతా చూస్తూ సంబరపడిపోతారు. పాత రోజులు బాగుండేవి ఆస్తులు లేకపోయినా సంతోషాలు ఉండేవి ఇప్పుడు అవి లేవు అని బాధపడుతారు.

మరోవైపు ధాన్యలక్ష్మి ప్రకాషం దగ్గరకు వచ్చి కళ్యాణ్‌ని ఇక్కడ ఉండేలాగ, ఆస్తి కావాలని అడగమని రెచ్చగొడుతుంది. ఆస్తి వస్తే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లి విడిగా హ్యాపీగా ఉండచ్చు అని చెప్పండి అంటుంది. ప్రకాశం ఎంతగా చెప్పినా వినకుండా ఆస్తి కోసం గొడవ చేస్తుంది. భార్య మాటలు వినలేక టైం ఇవ్వు నేను మాట్లాడుతాను అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad