ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, రాజ్ సరసాలు ఆడుకుంటుంటే ఆఫీస్‌కి టైం అవుతుందని కావ్య అంటుంది. రాజ్ ఏమో నీ చీర పట్టుకుంది నేను కాదు కప్‌బోర్డ్ అని చూపిస్తాడు. ఈలోగా పోలీస్ స్టేషన్ నుంచి ఆ నంద గాడు దొరికాడని ఫోన్ వస్తుంది. వెంటనే రాజ్, కావ్య బయలుదేరతారు. కింద దాన్యలక్ష్మి ఏమో ఓ పేపర్స్ పట్టుకుని గొడవ మొదలుపెడుతుంది. మేము అర్జెంట్‌గా వెళ్లాలి అంటే నాకు సమాధానం చెప్పే వెళ్లాలి అంటుంది దాన్యం. తన చేతిలో ఉన్న పేపర్స్ సుభాష్‌కి ఇచ్చి చూడండి వీళ్లు చేసిన పని అంటుంది దాన్యలక్ష్మి. మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకుంటుంటే స్వప్న ఆపుతుంది.
సుభాష్ ఏమి చెప్పకపోయే సరికి ధాన్యలక్ష్మి ఆ పేపర్స్‌లో ఉన్న విషయాన్ని చెప్తుంది. ఏమి అవసరం వచ్చిందని గెస్ట్‌హౌస్‌ని రూ.10 కోట్లకు తాకట్టు పెట్టారు అని అడుగుతుంది. మధ్యలో ఇందిరాదేవి సైతం రుద్రాణి, దాన్యలక్ష్మికి శుభ్రంగా గడ్డి పెడుతుంది. అప్పుడు సుభాష్ రాజ్‌ని అడుగుతాడు. అప్పుడు అపర్ణ వాళ్లు అడిగినా చెప్పరు ఎందుకు అడుగుతారు వాళ్లని వెళ్లనివ్వండి అంటుంది. అందరూ అన్ని ప్రశ్నలు అడుగుతుంటే మేము ఇప్పుడు సమాధానం చెప్పలేము అర్జెంట్‌గా వెళ్లాలి అంటాడు రాజ్. సాయంత్రం ఇంటికి వచ్చాక సమాధానం చెప్తాము అని వెళ్లిపోతారు.
అలా కార్‌లో వెళ్తూ రాజ్, కావ్యలు ఇంట్లో జరిగిన విషయాలు మాట్లాడుకుంటారు. మీ దగ్గర సమాధానం లేకుండా ఎలా సాయంత్రం చెప్తాను అన్నారు అని అడుగుతుంది కావ్య. అప్పుడు రాజ్ మనం ఇప్పుడు ఆ నంద గాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాము కదా డబ్బులు రాగానే అన్ని అప్పులు తీర్చేదం కంగారు పడకు అంటాడు రాజ్. వాడు మళ్లీ మిస్ అయితే అప్పుడు ఏమి చేస్తారు అని అడుగుతుంది కావ్య. మొత్తానికి ఆ నంద గాడు ఉన్న చోటకి వెళ్తారు రాజ్ హీరో ఎంట్రీ ఇచ్చి డైలాగ్స్ చెప్తాడు. అప్పుడు నంద కుడా నిన్నుచంపేస్తాను అని బెదిరించి రౌడీలను పంపిస్తాడు. మధ్యలో కావ్య ఏమో పిచ్చి పిచ్చి డైలాగ్స్ చెప్పి రౌడీలను ఆపడానికి ట్రై చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.