Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 9th Episode: గట్టిగానే ప్లాన్ వేసిందిగా రుద్రాణి.. ఈసారి కావ్య ఏమి చేస్తుందో..

Brahmamudi January 9th Episode: గట్టిగానే ప్లాన్ వేసిందిగా రుద్రాణి.. ఈసారి కావ్య ఏమి చేస్తుందో..

ఈరోజు ఎపిసోడ్‌లో ప్రకాశంకు జరిగిన అవమానం గురించి సుభాష్‌కు చెప్పి బాధపడుతాడు. సుభాష్ నువ్వు బాధపడకు నేను సరిచేస్తాను అంటాడు. రూమ్‌లోకి వెళ్తున్న ప్రకాశంను ఆపి కావ్య సారీ చెప్తుంది. ఆఫీస్ టెన్షన్‌లో అలా మాట్లాడాను అంటుంది. నా వల్ల కంపెనీకి ఎలాంటి లాభం జరగకూడదని ఇలా చేశావా అని అడుగుతాడు. పెద్దచిన్నా లేకుండా అవమానం చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా అంటాడు. ఎంత బ్రతిమాలినా కావ్య మాట వినకుండా ప్రకాశం వెళ్ళిపోతాడు. ఇదంతా ధాన్యలక్ష్మి చూసి అందరి ముందు అవమానం చేసి ఇప్పుడు వెన్న పూస్తున్నావా అంటుంది. ఎందుకిలా మారిపోయారు అత్తయ్యా అంటే నేను కాదు నవ్వు మారిపయావు. ఆస్తి రాగానే నీ నిజస్వరూపం బయట పెడతున్నావు అంటుంది ధాన్యం. నీకు ఎంత సపోర్ట్ చేశాను ఇదేనా నవ్వు నాకు, నా భర్తకి ఇచ్చే విలువ అని అంటుంది ధాన్యం. ధాన్యం అన్ని మాటలు అనేసి వెళ్లిపోతుంది, రూమ్‌లో ఏడుస్తున్న కావ్యను రాజ్ ఓదారుస్తాడు.

- Advertisement -
Image Credits: Disney+ hotstar

దీనంతటికీ కారణం తాతయ్య ష్యూరిటీ పెట్టడం. అందుకే మన తప్పు లేకుండా ఇంట్లో అంతా చెప్దాం అంటే నువ్వేవద్దు అన్నావు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటాడు రాజ్. అలా చేస్తే రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరూ ఓప్పుకోరు మా ఆస్తి మాకు కావాలి అని కోర్టుకి వెళ్తారు అది మంచిది కాదు అంటుంది కావ్య. మంచో చేడో తీసుకున్న నిర్ణయం మీద ఉందాం అంటుంది.

మరోవైపు రుద్రాణి, రాహుల్ ఎలా అయినా ఈ రామలక్ష్మణలను విడదీయాలి అని ప్లాన్‌లు వేస్తుంటారు. ఇంట్లో గొడవలు పెంచడానికి స్వప్నకు సీమంతం చేయాలని అనుకుంటారు. మరుసటి రోజు అందరూ హాల్‌లో కూర్చుని ఉంటే శాంతా వచ్చి రుద్రాణిని ఏం టిఫిన్ చెయ్యమంటారు అన అడుగుతుంది.నన్ను కాదు కావ్ను అడుగు అంటుంది. ఈరోజు నుంచి ఎవరికి ఏ టిఫిన్ కావాలో అది చెయ్యమని చెప్పారు అంటే, అవసరం లేదు అంటుంది రుద్రాణి చెప్తుంది. అప్పుడే పూజారి ఇంటికి వస్తే వరు పిలిచారు అని అడిగితే నేనే పిలిచాను అని రుద్రాణి అంటుంది. ఎవరికి బాధ్యత లేదు కనీసం నాకు అయినా ఉండాలి కదా అని, నా కోడలుకు శ్రీమంతం చేసేందుకు పిలిచాను అని అంటుంది. ఆ మాటలకూ స్వప్న షాక్ అవుతుంది. నీ కోసం కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం చేస్తున్న అని అంటుంది. అయినా మీరు చేసే పనికి నాకు అనుమానంగానే ఉంది అని అంటుంది స్వప్న. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News