డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..ఈమేరకు అధికారికంగా ప్రకటించారు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి. దీంతో యోట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలిసుల మోహరించారు. కోవిడ్ పాజిటివ్ తో ఆయన బాధపడుతూ వెంటిలేటర్ పై ఉండి కన్నుమూశారు.
గత కొన్ని నెలలుగా ఆయన ఆసుపత్రిలో చేరటం, డిస్చార్జ్ అవ్వటం జరుగుతుండగా ఆయన మరణించారనే వార్తలు కూడా పదేపదే వచ్చాయి. 71 సంవత్సరాల విజయ్ కాంత్ హీరోగా 154 సినిమాల్లో నటించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2011-2016 మధ్యకాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
DMDK పార్టీని స్థాపించిన ఆయన తమిళ రాజకీయాల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, పొలిటీషియన్ గా ఆయన తమిళ సినిమా, రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు.
విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించారు. ప్రధానంగా మిలిటరీ నేపథ్యంలోని సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు. ఇలాంటి సినిమాల్లో కెప్టెన్ పాత్రలు ఎక్కువగా పోషించి, ఆ సినిమాలు పెద్ద బ్లక్ బస్టర్ హిట్స్ కావటంతో విజయకాంత్ ను కెప్టెన్ విజయకాంత్ గా పిలుస్తారు అభిమానులు. ఈ క్రమంలో ఆయన ఇంటిపేరు కెప్టెన్ గా మారిపోగా చివరికి కెప్టెన్ గానే ఆయన్ను సంబోధించి అసలు పేరుగా కెప్టెన్ మారిపోయింది. విజయకాంత్ ను కెప్టెన్ గా చాలామంది అధికారికంగా పిలుస్తారు.
కాగా విజయకాంత్ పార్టీని స్థాపించి, సీఎం కాలేక, రాజకీయాల్లో ఓ స్టేజ్ తరువాత నెగ్గుకురాలేక రాజకీయ పతనం ప్రారంభం కావటాన్ని చాలామంది తమిళ నటులు ఓ జీవిత పాఠంగా తీసుకున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న రజనీకాంత్, విజయ్ వంటి తమిళ్ యాక్టర్స్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కెప్టెన్ విజయకాంత్ లోతుపాతులు తెలిసి, రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు.
కెప్టెన్ ప్రభాకర్ లాంటి విజయకాంత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ కాని భాషల్లో నటించే ఛాన్సులు ఎన్ని వచ్చినా ఆయన తమిళ్, తమిళ్, తమిళ్ తప్ప ఏ ఇతరత్రా భాషల్లో డైరెక్ట్ గా నటించకపోగా..ఆయన సినిమాలు మాత్రం చాలా భాషల్లో డబ్ అయి కాసుల వర్షం కురిపించేది. మాటకు ముందు తమిళ్ అనటం ఆయనకున్న అత్యంత ఇష్టమైన వ్యసనం. ఇక మన మంత్రి రోజా భర్త అయిన ఆర్ కే సెల్వమణి, ఇళవరనన్ వంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది కెప్టెన్ విజయకాంతే.
ఈయన్ను అభిమానులు కెప్టెన్, పురుచ్చి కలైంగార్ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా.. జయలలితను పురుచ్చి తలైవి అని, కరుణానిధిని కలైంగార్ అని పిలుస్తారని, ఆ రెండింటిలోని రెండు పదాలు చేర్చితే విజయకాంత్ ముద్దు పేరు వస్తుందని. మరదే కెప్టెన్ గొప్పతనం.