Monday, May 20, 2024
Homeఇంటర్నేషనల్Shakira belly dance statue: షకీరా బెల్లీ డ్యాన్స్ విగ్రహం

Shakira belly dance statue: షకీరా బెల్లీ డ్యాన్స్ విగ్రహం

షకీరాకు అరుదైన గుర్తింపు

మీరు చదువుతున్నది నిజమే. చూస్తున్న ఫోటో కూడా నిజమైనదే. ఇదేమీ మీమ్ కాదు, ఓఐ ఫేక్ పిక్ అసలే కాదు. షకీరాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. 21 అడుగుల షకీరా విగ్రహం అందులో ఆమె డ్యాన్స్ చేస్తూ, తన్మయత్వంలో ఉండే పోజుతో కూడిన ఈ శిల్పం ఆమె సొంతూళ్లు ప్రారంభించటం మరో హైలైట్.

- Advertisement -

టాప్ మ్యుజీషియన్ గా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది అభిమానులను సంపాదించుకున్న షకీరా చిన్నప్పుడు ఇదిగో ఇప్పుడీ శిల్పం ఉన్న పార్కులోనే ఆడి-పాడేవారని స్థానికులు గుర్తుతెచ్చుకుంటున్నారు. ఈ విగ్రహం చూసినవారంతా తమకు నచ్చిన రంగంలో దూసుకుపోయేందుకు కష్టపడి, తమ కలను సాకారం చేసుకునేలా ఈ విగ్రహం ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందనే ఉద్దేశంతో షకీరా నిలువెత్తు విగ్రహాన్ని ప్రారంభించినట్టు నిర్వాహకులు చెప్పటం ఆసక్తిగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News