Saturday, February 22, 2025
Homeచిత్ర ప్రభChandrababu: నటి కృష్ణవేణి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

Chandrababu: నటి కృష్ణవేణి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

సీనియర్ నటి కృష్ణవేణి(Krishnaveni) మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం తెలియజేశారు. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి ఆమె చేసిన సేవ మరువలేనిదన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని పేర్కొన్నారు.

- Advertisement -

కాగా ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి (102) వయోభారంగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. ‘మన దేశం’ సినిమాతో ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. అంతేకాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించారు. 1936లో ‘సతీ అనసూయ’ అనే సినిమాలో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News