Coolie OTT: రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్వకత్వంలో రూపొందిన కూలీ ఈ ఏడాది తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. నెగెటివ్ టాక్‌తో ఐదు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. కూలీ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు మలయాళం వెర్సటైల్ యాక్టర్ సౌబీన్ షాహిర్ విలన్స్‌గా నటించారు. కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించారు.
నెల రోజుల్లోనే…
కూలీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నట్లు చెబుతున్నారు. నెక్స్ట్ వీక్‌లో కూలీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు చెబుతున్నారు.
మొదటి సినిమా…
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి మూవీ ఇదే కావడంతో రిలీజ్‌కు ముందు కూలీపై భారీగా హైప్ ఏర్పడింది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. రెగ్యులర్ అంశాలతో కథ సాగడం, లోకేష్ కనగరాజ్ గత సినిమాల స్థాయిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో రజనీకాంత్ అభిమానులు డిజపాయింట్ అయ్యారు.
510 కోట్లు…
టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కూలీ అదరగొడుతోంది. 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 510 కోట్ల వరకు గ్రాస్.. 255 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. తెలుగులో 69 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ బాగున్నా ఈ సినిమా ఇప్పటివరకు లాభాల్లోకి అడుగుపెట్టకపోవడం గమనార్హం. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మరో యాభై కోట్ల దూరంలో నిలిచింది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ కూలీ సినిమాను నిర్మించింది. కూలీతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విలన్‌గా మారారు నాగార్జున. శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
రికార్డులు ఇవే…
కూలీ మూవీ 2025లో తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో మూడో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న నాలుగో సినిమాగా చరిత్రను సృష్టించింది.


