Sunday, November 16, 2025
HomeTop StoriesSSMB29: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన కీరవాణి తనయుడు..

SSMB29: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన కీరవాణి తనయుడు..

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వంచర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీస్, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్నేళ్ళుగా మహేష్-రాజమౌళి కాంబో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఫైనల్‌గా ఈ సినిమా సెట్స్‌లో ఉంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీలో మహేష్ బాబు లుక్ దగ్గర్నుంచీ ప్రతీ విషయంలో రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మహేష్-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కొడుకు కాల భైరవ సాలీడ్ అప్‌డేట్ ని ఇచ్చాడు.

Also Read – Fauzi Story: ‘ఫౌజీ’ కథకు మూలమేంటో రివీల్ చేసిన హను రాఘవపూడి

ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబందించిన మ్యూజిక్ సెషన్ స్టార్ట్ అయినట్టుగా తెలిపాడు. కీరవాణి మ్యూజిక్ అందించే ప్రతీ సినిమాలో కాల భైరవకి కీలక పాత్ర ఉంటుంది. అలాగే, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి కొన్ని కీలకమైన బాధ్యతలను అప్పగించారని భైరవ తెలిపాడు. దీంతో ఎస్ఎస్ఎంబి 29 మ్యూజికల్ గా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు. మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఇదో పెద్ద అచీవ్‌మెంట్ అని అందరూ చెప్పుకున్నారు.

కాబట్టి, ఎస్ఎస్ఎంబి 29 మూవీ సాంగ్స్ విషయంలోనూ అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కీరవాణి అద్భుతమైన ట్యూన్స్ ని కంపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మహేశ్ బాబు సర్కారు వారి పాట, గుంటూరు కారం లాంటి పక్కా కమర్షియల్ సినిమాల తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ మూవీని చేస్తుండటం పెద్ద హాట్ టాపిక్ అని చెప్పాలి. మరి, మహేష్-రాజమౌళి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్ఠిస్తుందో చూడాలి. ఈ సినిమాకి హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 20 భాషలలో 120 దేశాలలో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Also Read – Khaidi2: ఖైదీ 2 మొదలైంది, LCU ఫ్యాన్స్ కి పండగే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad