నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన “డాకు మహరాజ్”(Daku Maharaj) ఈనెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 9న అనంతపురంలో గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అల్లుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ రద్దు అయింది.
బుధవారం రాత్రి తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బాలయ్య అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో తొలిసారి భారీ ఈవెంట్ జరగనుండటంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.