Monday, January 13, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 13th Episode: అయ్యో పాపం దీప టిఫిన్ బండి కాలిపోయింది.. జ్యోత్స్న...

Karthika Deepam January 13th Episode: అయ్యో పాపం దీప టిఫిన్ బండి కాలిపోయింది.. జ్యోత్స్న ఇంత దారుణం చేస్తావా..

ఈరోజు ఎపిసోడ్‌లో జోత్స్న రౌడీలతో కార్తిక్, దీపల టిఫిన్ బండిని కాల్చేమని చెప్తుంది. రౌడీలు జోత్స్నకు వీడియో కాల్ చేసి కాల్చేయడం చూపిస్తారు. అప్పుడే దీపకు ఎవరో లేపినట్టు అనిపించి లేస్తుంది. వెళ్లి చూసే సరికి టిఫిన్ బండి కాలిపోవడం చూస్తుంది. రౌడీలను తరమడానికి ప్రయత్నిస్తుంది. కార్తిక్ బాబు అని గట్టిగా అరుస్తే కార్తిక్ లేచి వెళ్తాడు. కార్తిక్ వెళ్లి ఆ రౌడీలను వెంబడిస్తాడు. ఇంట్లో వాళ్లు అందరూ బయటికి వచ్చి చూసి ఏడుస్తారు. కార్తిక్ రౌడీలను పట్టుకుని ఫుల్‌గా కొడతాడు. ఈలోపు మొత్తం టిఫిన్ బండి అంతా కాలిపోతుంది. అక్కడ కార్తిక్ రౌడీ మాట్లాడుతున్న ఫోన్‌ను కార్తిక్ చూస్తాడు. ఫోన్‌లో జోత్స్న నంబర్ ఉండటం చూసి జోత్స్న అని గట్టిగా అరుస్తాడు. కార్తిక్‌కి రౌడీలు దొరికిపోయారా అక్కడ ఏమి జరుగుతుంది అని జోత్స్న టెన్షన్ పడుతుంది.

- Advertisement -

దీప వాళ్ల దగ్గరికి కార్తిక్ వస్తాడు. దీప ఏడుస్తూ ఉంటుంది. మన బతుకు దెరువు ఇదే ఎలా అయిపోయిందో చూడండి అంటూ ఏడుస్తుంది. రౌడీలను వెంబడిచారు కదా ఎవరు వాళ్లు తెలిసిందా ఎవరో అంటే తెలిసింది మొన్న టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు కదా వాడే పారిపోయారు అంటాడు. పదండి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని ఈ మంట్లో పడేసి బూడిద చేద్దాం అంటుంది దీప. వదిలిలేయండి వారు పారిపోయాడు ఇప్పుడు ఏమి చేస్తామ అంటాడు కార్తిక్. మన టిఫిన్ సెంటర్‌న ఇలా చేసిన వాడిని ఎలా వదిలేస్తాము అని కార్తిక్ అమ్మ అంటుంది. అలా బాధపడుతూ ఉంటారు. కార్తిక్ దీపని, అమ్మని ఓదారుస్తాడు.

Image Credits: Disney+Hotstar

ఉదయం కాశీ, దాసు వాళ్లు ఇంటికి వస్తారు. ఎవరు చేశారు ఇలా అని అవే మాట్లాడుకుంటారు. అక్కడ జోత్స్న బావకు ఇప్పుడు నా ఒదార్పు అవసరం అని దీప ఇంటికి వెళ్తుంది. ఏమి తెలియనట్టు పరామర్శస్తుంది. కార్తిక్ కుడా గట్టిగా సమాధానం ఇస్తాడు. ఎవరు చేశరో సరిగ్గా వివరాలు లేవు లేదంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేవాళ్లం అంటాడు. దీప ఏది లోపల ఏడుస్తుందా అని అడిగితే ఏడుస్తూ కూర్చోవడానికి కాలిపోయింది మా బండి మాత్రమే, అది కాకపోతే బల్ల మీద పెట్టుకుని వ్యాపారం చేస్తాము అంటుంది దీప వచ్చి. ప్రతి రోజ లాగే టిఫిన్‌ను బల్ల మీద పెట్టి అమ్ముతుంది. ఇంటి ఒనర్ వచ్చి మీరు బాధలో ఉంటారు అనుకున్నాను మిమ్మళ్నిచూస్తుంటే బాగుంది అంటాడు. నాకు కూతురు లేదు నువ్వే కూతురు అనుకుంటాను అంటాడు ఒనర్. కార్తిక్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తాడు.

అలా దీప మళ్లీ టిఫిన్ అమ్మడం మొదలు పెడుతుంది. జోత్స్న కడుపు మండిపోతుంటుంది. అలా అక్కడ ఉన్న అందరితోనూ గొడవ పెట్టుకుంటుంది. నలుగురు నాలుగు మాటలు అనే సరికి మండిపోతుంది. మీకు సాయం చేయడానికి వచ్చినందుకు నన్ను నేను తిట్టుకోవాలి అంటుంది జోత్స్న. మా టిఫిన్ బండిని కాల్చినందుకు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అని మనసులో తిట్టుకుంటాడు కార్తిక్. నువ్వేమి మాకు సాయం చేయక్కర్లేదు ఇక్కడి నుంచి వెళ్లు ఎలా వ్యాపారం చేసుకోవాలో మాకు తెలుసు అంటాడు కార్తిక్ ఇక్కడితో ఈరోజు ఎపిసోడి పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News