Saturday, November 15, 2025
HomeTop StoriesDil Raju: బాలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు - దిల్‌రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా?

Dil Raju: బాలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు – దిల్‌రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా?

Dil Raju: టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు దిల్‌రాజు. ఒక‌ప్పుడు దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుందంటే గ్యారెంటీ హిట్టే అనే న‌మ్మ‌కం ఆడియెన్స్‌లో ఉండేది. గ‌త కొన్నాళ్లుగా క‌థ‌ల విష‌యంలో దిల్‌రాజు జ‌డ్జిమెంట్ రాంగ్ అవుతోంది. దిల్‌రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్‌తో పాటు గేమ్ ఛేంజ‌ర్‌, త‌మ్ముడు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ఒక్క‌టే దిల్‌రాజును గ‌ట్టెక్కించింది. న‌ష్టాల నుంచి కొంత వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డేసింది.

- Advertisement -

రెండు ఫ్లాపులే…
టాలీవుడ్‌లో హిట్టు సినిమాల ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజుకు బాలీవుడ్ మాత్రం క‌లిసిరాలేదు. హిందీలో ఇప్ప‌టివ‌ర‌కు జెర్సీతో పాటు హిట్ ది ఫ‌స్ట్ కేస్ సినిమాల‌ను నిర్మించారు దిల్‌రాజు. తెలుగులో క‌ల్ట్ క్లాసిక్‌లుగా నిలిచిన ఈ సినిమాలు హిందీలో మాత్రం దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. దిల్‌రాజుకు భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టాయి.

Also Read- Bigg Boss Wildcards: బిగ్ బాస్ హౌస్ లో హ్యాండ్సమ్ హంక్స్.. స్పెషల్ పవర్స్‌తో నిఖిల్-గౌరవ్ ఎంట్రీ

సంక్రాంతికి వ‌స్తున్నాం రీమేక్‌…
దాదాపు మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ సినిమాల ప్రొడ‌క్ష‌న్‌పై దిల్‌రాజు ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సారి ఏకంగా అక్ష‌య్‌కుమార్‌, స‌ల్మాన్ ఖాన్‌ల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు దిల్‌రాజు. ఈ సినిమాలో అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. హిందీ వెర్ష‌న్‌కు అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్ కాద‌ట‌. స్క్రిప్ట్ సూప‌ర్ వైజ‌ర్‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రీమేక్‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దాదాపు పూర్త‌యిన‌ట్లు టాక్‌. అక్ష‌య్ కుమార్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.

వంశీ పైడిప‌ల్లితో…
సంక్రాంతికి వ‌స్తున్నాం రీమేక్‌తో పాటు స‌ల్మాన్‌ఖాన్‌తో దిల్‌రాజు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా వార్త‌లొస్తున్నాయి. ఈ బాలీవుడ్ మూవీకి టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు టాక్‌. ఇటీవ‌లే స‌ల్మాన్‌ఖాన్‌ను క‌లిసిన ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. స్టోరీ న‌చ్చ‌డంతో స‌ల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Also Read- Fake Promise: ఆధ్యాత్మిక గురువును కలిపిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

కాగా ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్‌, అక్ష‌య్‌కుమార్ ఇద్ద‌రు ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఈ టైమ్‌లో వీరితో సినిమాలు అంటే పెద్ద రిస్క్ చేస్తున్న‌ట్లేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌ల్మాన్‌ఖాన్‌, అక్ష‌య్ సినిమాల‌తోనైనా హిందీలో ప్రొడ్యూస‌ర్‌గా దిల్‌రాజుకు హిట్టు ద‌క్కుతుందో లేదో చూడాల్సిందేన‌ని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad