War 2 First Single: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న వార్ 2 మూవీ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ బాలీవుడ్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్‌లను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టన్నింగ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌పై మేకర్స్ హింట్ ఇచ్చారు.
రొమాంటిక్ డ్యూయెట్…
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మంగళవారం సోషల్ మీడియాలో వార్ 2 ఫస్ట్ సింగిల్ ఆవన్ జావన్ గురించి పోస్ట్ వేశారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఇటలీలో ఈ పాటను షూట్ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో అవన్ జవాన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. హృతిక్, కియారా రొమాంటిక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు అయాన్ ముఖర్జీ. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read – Lavanya Tripathi: మెగా కోడలి మూవీ టీజర్ అదిరిందిగా – సతీ లీలావతితో లావణ్య త్రిపాఠి రీఎంట్రీ!
బ్రహ్మాస్త్ర మ్యాజిక్…
అవన్ జావాన్ పాటకు బ్రహ్మాస్త్రలోని బ్లాక్‌బస్టర్ సాంగ్ కేసరియాకు ఓ లింక్ ఉంది. కేసరియా పాటకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్, లిరిసిస్ట్ అమితాబ్ భట్టాచార్య, సింగర్ ఆర్జిత్ సింగ్.. అవన్ జవాన్ కోసం మళ్లీ కలిశారు. అవన్ జవాన్ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా… ప్రీతమ్ మ్యూజిక్ సమకూర్చారు. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను ఆర్జిత్ సింగ్ ఆలపించారు. కేసరియా తరహాలోనే ఈ పాట పెద్ద మ్యూజికల్ హిట్ కావడం ఖాయమని బాలీవుడ్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
కెమిస్ట్రీ హైలైట్…
అవన్ జవాన్ పాటలో హృతిక్ రోషన్, కియారా కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుందట. ఇద్దరు పోటీపడి డ్యాన్స్ చేసినట్లు మేకర్స్ చెబుతోన్నారు. కియారా గ్లామర్ కూడా ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అంటున్నారు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్…
వార్ 2 మూవీని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సీక్రెట్ ఏజెంట్స్ పాత్రల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ యాక్షన్ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వార్ 2 మూవీ హిందీతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read – Actress Samantha: సమంత స్టామినా… సో స్ట్రాంగ్..!


