Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభSudheer-Rashmi : సుధీర్, రష్మీ జంటగా సినిమా.. డైరక్టర్ ఎవరంటే?

Sudheer-Rashmi : సుధీర్, రష్మీ జంటగా సినిమా.. డైరక్టర్ ఎవరంటే?

- Advertisement -

Sudheer – Rashmi : సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ సెలబ్రిటీ. బయట సుధీర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీలో రాణిస్తూనే వెండితెరపై కూడా సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్క కమెడియన్ గా క్యారెక్టర్స్ వేస్తూనే మరోపక్క హీరోగా కూడా చేస్తున్నాడు. సుధీర్ హీరోగా గతంలో వచ్చిన సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా తీసిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డితోనే ఇటీవల గాలోడు సినిమా తీసాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.

దీంతో గాలోడు సక్సెస్ మీట్స్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో గాలోడు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలిపాడు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..”సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు రెండు సినిమాలు ఒకేసారి ఓకే అయ్యాయి. ఈ రెండు సినిమాలని రష్మీకి కూడా వినిపించి హీరోయిన్ గా చేయమని అడిగాము. కానీ రష్మీ డేట్స్ ఖాళీగా లేవు. బయట సుధీర్, రష్మీ జోడికి మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దర్నీ పెట్టి గజ్జెల గుర్రం అనే ఓ సినిమా చేస్తాను. ప్రస్తుతానికి ఆ కథ మీద వర్క్ చేస్తున్నాను. ఈ సారి రష్మీ డేట్స్ ఇస్తే కచ్చితంగా సుధీర్, రష్మిలతో సినిమా తీస్తాను” అని తెలిపాడు.

సోషల్ మీడియాలో, బయట జనాల్లో సుధీర్, రష్మీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఈ గజ్జెల గుర్రం సినిమా వస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News