Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది'(Peddi) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో చరణ్ ఆడిన ఫస్ట్ షాట్‌కు భారీ రెస్పాన్స్ లభించింది. క్రికెటర్ల దగ్గరి నుంచి అభిమానుల వరకు అందరూ ఈ షాట్‌ను ట్రై చేస్తున్నారు. ఇకఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ ట్రైన్ సీక్వెన్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మీర్జాపూర్ ఫేమ్ మున్నాభాయ్ అలియాస్ దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మూవీ నుంచి దివ్యేందుకు శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో క్రికెట్ బాల్ పట్టుకుని బౌలింగ్ చేసేందుకు సిద్ధం అయినట్లుగా దివ్యేందు కనిపిస్తున్న లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే రంగస్థలం తర్వాత రా అండ్ రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ నటిస్తుండటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక గ్లింప్స్ విడులైక ఒక్కసారిగా మూవీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఓటీటీ కంపెనీ రూ.100 కోట్లకు పైగానే మూవీ రైట్స్ దక్కించుకున్నట్లు ఫిల్స్ నగర్ టాక్. స్పీడ్‌గా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చెర్రీ గత సినిమా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ పాన్ ఇండియా హీరోగా మరోసారి నిరూపించుకోవాలని చెర్రీ పట్టుదలతో ఉన్నాడు.