Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభDu Du Lyrical Video Song : సిగ్నేచర్‌ స్టెప్స్‌ల‌తో ఆకట్టుకుంటున్న రవితేజ

Du Du Lyrical Video Song : సిగ్నేచర్‌ స్టెప్స్‌ల‌తో ఆకట్టుకుంటున్న రవితేజ

Du Du Lyrical Video Song : మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ధ‌మాకా’. ‘డ‌బుల్ ఇంపాక్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న శ్రీలీల న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

- Advertisement -

ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ గ్లిమ్స్‌, టీజ‌ర్‌ల‌తో పాటు ‘జింతాక్’, ‘వ్యాట్స్ హ్యాపెనింగ్’ పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో నేడు ఈ చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ‘డు డు డు ’ అంటూ ఈ పాట సాగుతోంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించ‌గా పృథ్వీచంద్ర ఆలపించిన ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విడుద‌లైన కాసేటికే యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News