Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDude VS Telusu Kada: డ్యూడ్ వ‌ర్సెస్ తెలుసు క‌దా - ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌లో...

Dude VS Telusu Kada: డ్యూడ్ వ‌ర్సెస్ తెలుసు క‌దా – ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌లో తెలుగు హీరోపై త‌మిళ స్టార్ డామినేష‌న్‌

Dude VS Telusu Kada: ఈ దీపావ‌ళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు సినిమాలు పోటీప‌డ్డాయి. వీటిలో మిత్ర‌మండ‌లి గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రాగా… శుక్ర‌వారం తెలుసు క‌దాతో పాటు డ్యూడ్ రిలీజ‌య్యాయి. డ్యూడ్‌, తెలుసు క‌దా… రెండు సినిమాలు బోల్డ్ కాన్సెప్ట్‌ల‌తోనే రూపొందాయి. ఈ రెండింటిలో ఫ‌స్ట్ డే ఏ సినిమా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌న్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది.

- Advertisement -

సెన్సిటివ్ పాయింట్‌తో…
స్టోరీ ప‌రంగా రెండు రొటీన్ సినిమాలే అనే కామెంట్స్ వ‌స్తున్నాయి. డ్యూడ్ కామెడీ ప్ర‌ధానంగా సాగ‌గా… తెలుసు క‌దా మూవీలో ఓ సెన్సిటివ్ పాయింట్‌ను ఎమోష‌న‌ల్‌గా చూపించార‌ని చెబుతున్నారు.

క‌లెక్ష‌న్స్‌లో తొలిరోజు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌పై ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ డామినేష‌న్ క‌నిపించింది. డ్యూడ్ మూవీ శుక్ర‌వారం రోజు ప‌దిన్న‌ర‌ కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ మూవీ అద‌ర‌గొట్టింది. డ్యూడ్‌కు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ తెలుసు క‌దా ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. తెలుసు క‌దా మొద‌టిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది.

Also Read – BC bandh: అంబర్‌పేట ర్యాలీలో అపశ్రుతి.. కింద పడిపోయిన వీహెచ్‌!

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, రాశీఖ‌న్నా, శ్రీనిధి శెట్టి యాక్టింగ్ బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చినా ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాలేదు. స్లోగా ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ పిక‌ప్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి. ప్ర‌మోష‌న్స్‌లో అనుకున్న‌ స్థాయిలో లేక‌పోవ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు నెగెటివ్ టాక్ రావ‌డం ఓపెనింగ్‌పై ఎఫెక్ట్ చూపించిన‌ట్లు క‌నిపిస్తోంది. టాక్‌, క‌లెక్ష‌న్స్‌ను బ‌ట్టి చూస్తుంటే దీపావ‌ళి విన్న‌ర్‌గా డ్యూడ్ నిలిచేలా క‌నిపిస్తోంది. మిత్ర‌మండ‌లి తొలిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. శ‌నివారం రిలీజైన కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే ర్యాంప్‌కు ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి దారుణంగా నెగెటివ్ టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రెండో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డ్యూడ్ జోరు కొన‌సాగేలా క‌నిపిస్తోంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌…
డ్యూడ్ మూవీ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో నిర్మాత‌ల‌కు ఈ సినిమా గ‌ట్టిగానే లాభాల‌ను మిగిల్చేలా క‌నిపిస్తోంది. కీర్తిశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, నేహా శెట్టి కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌రోవైపు తెలుసు క‌దా మూవీతో స్టైలిష్ట్ నీర‌జ కోన డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

Also Read – Samantha: నేను ప‌ర్ఫెక్ట్ కాదు.. కొన్ని త‌ప్పులు చేశా- స‌మంత కామెంట్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad