బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండంటతో ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో సైఫ్ నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. గేటు లోపలికి వెళ్లగానే కారు నుంచి దిగి మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆయన చేతికి ఓ కట్టు ఉండటం మినహా ఎలాంటి ఇబ్బంది లేకుండా హుషారుగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకుని సినిమాల్లో తిరిగి నటించాలని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం కాగా.. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఇప్పటివరకు సైఫ్ ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల బీమా కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. దాడి నేపథ్యంలో సైఫ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.