Diwali Movie: ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీపడబోతున్నాయి. తెలుసు కదా, కే ర్యాంప్, మిత్రమండలితో పాటు డ్యూడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. నాలుగు సినిమాలు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సినిమాలతో నలుగురు కొత్త దర్శకులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరిలో హిట్టు కొట్టేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుసు కదా….
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. స్టైలిష్ట్ నీరజ కోన ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పట్టి ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని తెరకెక్కించింది. దీపావళికి రిలీజ్ కానున్న సినిమాల్లో తెలుసు కదా పైనే ఎక్కువగా హైప్ నెలకొంది. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంది నీరజ కోన. డైరెక్టర్‌గా డెబ్యూ మూవీతో ఆమె పాస్ అవుతుందా? లేదా? అన్నది దీపావళికి తేలనుంది.
మిత్రమండలి..
ఈ పండుగకు స్టార్ వాల్యూ కాకుండా కంటెంట్, కామెడీని నమ్ముకొని రూపొందుతోన్న మూవీ మిత్రమండలి. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎమ్, విష్ణు, రామ్‌మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కామెడీ మూవీతో విజయేందర్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అక్టోబర్ 16న సినిమా రిలీజ్ అవుతోంది. కానీ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌ను ప్రదర్శించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – Bigg Boss Elimination: బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్.. మరో ఘోరం వైల్డ్ కార్డుల చేతిలో శ్రీజకు దెబ్బ
కిరణ్ అబ్బవరం కే ర్యాంప్..
ఇప్పటివరకు మాస్, లవ్‌స్టోరీస్ ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ కథాంశంతో కే ర్యాంప్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో జైన్స్ నాని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమలోకి తొలి అడుగు పెట్టబోతున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆంధ్రా అబ్బాయి, కేరళ అమ్మాయి మధ్య ప్రేమకథతో కేర్యాంప్ మూవీ రూపొందుతోంది. కే ర్యాంప్‌లో కామెడీతో పాటు రొమాంటిక్ డోస్ ఎక్కువగానే ఉన్నట్లు టీజర్, ట్రైలర్‌లతో హింట్ ఇచ్చేశారు మేకర్స్. కే ర్యాంప్ అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది.
డ్యూడ్…
లవ్ టుడే, డ్రాగన్ సినిమాల ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న డ్యూడ్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రేమలు ఫేమ్ మమితాబైజు హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కీర్తిశ్వరన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో భారీ స్థాయిలో ఈ తమిళ హీరో మూవీ రిలీజ్ అవుతోంది.
Also Read – Bigg Boss Wild Card Entries: బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఫైనల్ లిస్టు ఇదే.. హౌస్‌లోకి ఎవరెవరు రానున్నారంటే?


