Gunasekhar – Euphoria : వైవిద్యమైన కంటెంట్ మాత్రమే కాదు.. భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే దర్శకుల్లో గుణ శేఖర్ ఒకరు. ఒక్కడు, చూడాలని ఉంది వంటి సోషల్ సినిమాలే కాదు.. రుద్రమదేవి, శాకుంతం వంటి పీరియాడిక్, మైథలాజికల్ సినిమాతోనూ ఆయన మెప్పించారు. ఆయన గత చిత్రం శాకుంతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. తర్వాత రానా దగ్గుబాటితో చేయాలనుకున్న హిరణ్యకశ్యప సినిమా ఆగిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం. దీంతో గుణ శేఖర్ ఈ గ్యాప్‌లో నేటి ట్రెండ్‌కు తగినట్లు.. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఓ సినిమా చేశారు. అదే యుఫోరియా. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 25న విడుదల చేయటానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో.. నీలిమ గుణ, యుక్తా గుణ యుఫోరియా సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో భూమిక చావ్లా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇంకా సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రెండు దశాబ్దాల ముందు గుణ శేఖర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సినిమా క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఆ మూవీలో మహేష్ సరసన భూమిక నటించింది. ఒక్కడు మూవీ భూమిక కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటూనే చక్కటి మెసేజ్ కూడా యుఫోరియా సినిమాలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. కానీ గుణ శేఖర్ ఎలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేశాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ట్రైలర్ విడుదల తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


