Tuesday, February 4, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu February 4th Episode: నువ్వు సూపర్ మీనా.. ఇన్నాళ్ల కు మీ...

Gunde Ninda Gudigantalu February 4th Episode: నువ్వు సూపర్ మీనా.. ఇన్నాళ్ల కు మీ అత్తకు ఎదురుతిరిగావు..

ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం నగలు ఇవ్వవద్దు అంటుంటే మధ్యలో ప్రభావతి మాత్రం డబ్బా కబుర్లు చెప్తుంది. అప్పుడు శోభన మాత్రం ఇవన్నీ ఆచారమే కదా మా కూతురుకి మేము ఇచ్చినట్టే మీ పెద్ద కోడలు కుడా తెచ్చే ఉంటుంది కదా అని కావాలని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి రోహిణి వాళ్ల నాన్న గురించి గొప్పలు చెప్తుంది. అలా మీనా ఎంత తెచ్చింది అని అడిగితే దానికి ప్రభావతి అది తేక పోగా మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది. మా ఆయన కొంచెం ముందు రిటైర్ అయినా బాగున్ను వీళ్ల నాన్నకు ఏ బస్సు దొరకకా ఈయన బస్సు కిందే పడి చచ్చాడు దానికి ప్రాయశ్చిత్తమే ఇది అని వీళ్లకి బంగారం పెట్టే అంత స్థోమత ఎక్కడిది వీళ్లు పూలు అమ్ముకునేవాళ్లు అంటుంది. సత్యం ఆపిన ఆగకుండా మాట్లాడుతుంది.

- Advertisement -

కావాలని మీనా వాళ్ల అమ్మగారి స్థాయి గురించి చులకనగా తక్కువ చేసి మాట్లాడుతుంది. మీనా వాళ్ల నాన్న చస్తే గాని దాని పెళ్లి చేయలేని పరిస్థితి అని చిరాకుగా మాట్లాడుతుంది. ఆ మాటలకు మీనా చాలా బాధపడి అన్న మాటలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మీనా దగ్గరికి వచ్చి ప్రభావతి ఇక్కడేమి చేస్తున్నావు వెళ్లి పనులు చేయి అంటుంది. మీరు వచ్చింది పనులు చేయమని చెప్పడానికా మీరు అన్న మాటలకు బాధపడి కాదా అంటుంది. ఇంట్లో పనులు చేయడానికి నేనే కనిపిస్తున్నానా, ఇంకెవరూ ఆడవాళ్లు లేరా నేనే చేయాలా అంటుంది మీనా. మీరు ఏది చెప్తే అది చేస్తాను కుక్కిన పేనులా కుక్కిఉంటాను అని ఇక్కడ పడేసారా అంటుంది. అలా గట్టిగా ఎదురు తిరిగే సరికి అందరూ షాక్ అవుతారు. ఎదురిస్తున్నావేంటి అంటే ఏ మీకు సమాధానం చెప్పడానికి కోటీశ్వరుల కూతురు అవ్వాలా అని అడుగుతుంది. అత్త అని కుడా చూడకుండా అరుస్తుందని సత్యంకి చెప్తుంది.

ఏమైంది అని సత్యం అడిగితే మీకు తెలియదా అత్తయ్య ఏమి మాట్లాడారో అని లేని మా నాన్న కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా అని అడుగుతుంది. సత్యంతో కలిపి ఇంట్లో అందరూ ప్రభావతిని తప్పుపడతారు. మీనా మాత్రం ఇన్నాళ్లకు బాగా అడిగింది. ప్రభావతి చేసిన పనికి గట్టిగా తిడతారు. నేను ఏమి తప్పు చేయలేదు వీళ్లకేమి స్థాయి లేదు మనం బంగారం వేయకపోతే ఇది పసుపు కొమ్ముతో ఉంటుంది. అంటే మీనా బాగా ఫీల్ అయ్యి మీనాకి పెట్టిన బంగారం అంతా తెచ్చి ఇస్తుంది. ఈలోగా బాలు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. బాలు ఎంతగా అడిగినా ఎవరు ఏమి చెప్పకపోయే సరికి బాధపడుతూ మీనా జరిగింది అంతా మొత్తం చెప్తుంది. అవేమి మా అమ్మ వాళ్ల పుట్టింటి నుంచి తెచ్చినవి కాదు మా నాన్న కొన్నావి అవి నువ్వు వేసుకో అంటే మీనా ససేమిరా వేసుకోను అని చెప్తుంది. అప్పుడు ప్రభావతి ఏదో మొత్తం తెచ్చి ఇచ్చేసినట్టు చెప్తున్నావు నీ మెడలో తాడు కుడా మేము ఇచ్చిందే అంటే నాకు తెలుసు ఇదే అంటారని అందుకే అది తెచ్చాను నా మెడలో పసుపు కొమ్ము కట్టుకున్నాను తీసుకోండి అని ఇచ్చేస్తుంది. నేను ఎన్నో మాటలు పడ్డాను కానీ ఎప్పుడు ఎదురు పడలేదు మా నాన్న మమ్మళ్ని బాగా పెంటాడు మా దురదృష్టం ఆయన లేరు ఉండి ఉంటే నాకు ఈ బాధలు తప్పును అని బాధపడుతుంది ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News