Tuesday, October 8, 2024
Homeచిత్ర ప్రభHema Malini daughter Esha divorce: హేమమాలిని కుమార్తె డైవర్స్

Hema Malini daughter Esha divorce: హేమమాలిని కుమార్తె డైవర్స్

పరస్పర అంగీకారంతో విడాకులు

డ్రీమ్ గర్ల్ హేమమాలిని కుమార్త ఈషా డైవర్స్ తీసుకుంటున్నారు. తాను-తన భర్త ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయి, వేర్వేరు జీవితాలు ప్రారంభిస్తున్నట్టు హీరోయిన్ ఈషా చెప్పటం సెన్సేషనల్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ గా తన లక్ ట్రై చేసిన ఈషాకు ఆఫర్సు వచ్చినప్పటికీ ఆమెకు హిట్స్ లేక, సరైన గుర్తింపు లేక తన తల్లి లెగసీని ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేకపోయారు. ఆతరువాత ఆమె వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయి, మరోవైపు తల్లి హేమమాలిని, తన సిస్టర్స్ తో కలిసి ప్రపంచవ్యాప్తంగా క్లాసికల్ డ్యాన్సు ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

- Advertisement -

బిజినెస్ మ్యాన్ భరత్ తక్థానీని 2012లో వివాహం చేసుకున్న ఈషా డియోల్ కు ఇద్దరు కుమార్తెలు. ధూమ్ వంటి హిట్ మూవీలో హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోసినా ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఓటీటీల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈషా యాక్ట్రెస్ గానే కాక, క్లాసికల్ డ్యాన్సర్, రియాల్టీ షోస్ యాంకర్, బుక్ రైటర్ గా కూడా రాణిస్తూ తన టాలెంట్ చాటుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News