Saturday, July 27, 2024
HomeఆటNandyala: మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ ముకుందకు సన్మానం

Nandyala: మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ ముకుందకు సన్మానం

సహాయ సహకారాలందిస్తాం

నంద్యాల డివైఎఫ్ఐ కార్యాలయంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల విజేతకు సన్మానం చేశారు. నంద్యాల వాసి బి. ముకుంద అనే యువకుడు మిస్టర్ ఆంధ్ర మొదటి విజేతగా నిలిచాడు. అతని ప్రోత్సహిస్తూ మాజీ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఏసు రత్నం, పుల్లా నరసింహ ముకుందకు సన్మానం చేశామని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీనా ఆంధ్రా బాడీబిల్డర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. అందులో మన నంద్యాల జిల్లాకు చెందినటువంటి బి ముకుంద 75 కిలోల విభజనలో మొదటి స్థానం సాధించి మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ఓవరాల్ విజేతగా నిలిచాడు. బి. ముకుంద నంద్యాల జిల్లా తండ్రి బి.దామోధర్ తల్లి బి జయశ్రీ నంద్యాలలోని న్యూ బాడీలైన్ జిమ్ హెల్త్ & ఫిట్‌నెస్ క్లబ్ కోచ్ ఖ్వాజా మొహిద్దీన్ దగ్గరా శిక్షణ తీసుకుంటూ ఈ ఘనత సాధించాడు. ఎల్లవేళలా ముకుందాకి మా సహాయ సహకారాలు ఉంటాయని ముకుంద మిస్టర్ ఇండియా ప్రైస్ కొట్టి మన నంద్యాల పేరును దేశవ్యాప్తంగా నిలపాలని అందుకు సంబంధించి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారన్నారు. ఈ సందర్బముగా కోచ్ ను అభినందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ నాయకులు బాల వెంకట్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కుమారు, నాయకులు రాజు అన్నా, జిమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ ఇటువంటి క్రీడాకారులను ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులను అందర్నీ ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందించాలని, రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ లో ఎన్నికైన నంద్యాల వాసులను స్థానిక ఎమ్మెల్యే గుర్తించి పైన ఆర్థిక సహాయం అందించాలని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ సిపిఎం పార్టీగా తెలుపుతున్నామని అన్నారు. నంద్యాలకు ఎంతో పేరు తెచ్చిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని, రాబోయే రోజుల్లో క్రీడాకారులకు అండగా ఉంటామని షాప్ చైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాలకు పేరు తెచ్చిన బాడీ బిల్డర్ వారిని గుర్తించి పైన సత్కారం చేయాలని సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News