Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభAjith: హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం

Ajith: హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌ఛాంప్స్ రేస్‌లో అజిత్ పాల్గొన్నారు. అయితే రేసింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. అజిత్ స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు.

- Advertisement -

కాగా గతంలోనూ ఓ కార్ రేస్ ఈవెంట్‌లో అజిత్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలోనూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోసారి ఇదే విధంగా కారు ప్రమాదం కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News