Dhruv: విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైసన్. మారి సెల్వరాజ్ దర్శకుడు. అక్టోబర్ 24న మూవీ రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్‌కు హైదరాబాద్‌కు వచ్చిన ధ్రువ్ తెలుగు రాసుకుని దాన్ని నేర్చుకుని మాట్లాడటం అందరికీ నచ్చింది. హైదరాబాద్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ధ్రువ్ మాట్లాడారు. తెలుగులో సినిమా చేయాలనుందని చెప్పిన ధ్రువ్ ఏమన్నారంటే..‘‘నేను రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక మాల్‌కి సూట్‌కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్‌తో బేరం చేస్తుండగా. కొంతమంది బయట నుంచి నన్ను చూసి విష్ చేశారు. వాళ్లు మీ ఫ్రెండ్సా అని షాప్ యజమాని అడిగాడు. కాదని చెప్పాను. మీరు యాక్టరా అని అడిగాడు. అవునని చెప్పాను. ఆ సమయంలో నాకు గడ్డం ఉండింది. నన్ను పరీక్షగా చూసిన షాప్ ఓనర్ మీరు చూడటానికి యాక్టర్ విక్రమ్‌లా ఉన్నారని అన్నాడు. అప్పుడు నేను ఆయన కొడుకుని అన్నాను. అది చెప్పగానే ఓనర్ మీ నాన్నగారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇండియన్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అంటూ నాన్నపై తన ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ ప్రశంసలు కురిపించాడు.
Also Read – Venkatesh: అఫీషియల్ – వెంకీ మామకు హీరోయిన్ దొరికేసింది – త్రివిక్రమ్ సినిమాలో కన్నడ బ్యూటీ
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నాన్న నటనతో అన్నీ రాష్ట్రాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంత లవ్‌ను సంపాదించిన ఆయన్ని చూసి కొడుకుగా గర్వపడుతున్నాను. విక్రమ్ కొడుకు కాబట్టి నాకు అన్నీ ఈజీగా వచ్చాయేమోననిపిస్తోంది. నేను ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. మా నాన్నలాగానే కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను. తెలుగువాళ్లు ఫుడ్‌ని, సినిమాను ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో నాకు తెలుసు. నాకు తెలుగులో సినిమా చేయాలనుంది. బైసన్ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలా మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను. ప్రొఫెషనల్‌గా కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇవ్వండి. నచ్చితే సపోర్ట్ చేయండి. రేపు నాకొక కొడుకు పుడితే, వాడు ఒక సూట్‌కేసుని ఇక్కడ కొనటానికి వచ్చి బేరం చేస్తుంటే ఆ షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలనేది నా కోరిక’’ అన్నారు ధ్రువ్.
నిజానికి ధ్రువ్ తెలుగు రాసుకుని దాన్ని ఎలా పలకాలో నేర్చుకుని మరీ స్టేజ్‌పైకి వచ్చి మాట్లాడటంతో అక్కడున్న అందరూ ఫిదా అయిపోయారు. సినిమా విషయానికి వస్తే .. ఇదొక పీరియాడిక్ మూవీ. 1990లో జరిగే కథాంశం. ఓ గ్రామంలో కక్షలు, కబడ్డీ ఆటకు ఉండే లింక్.. చివరకు అందులో చిక్కుకున్న యువకుడు ఏం చేశాడనేదే బైసన్ కథ. ధ్రువ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.
Also Read – Megastar Chiranjeevi: ఆగిపోయిన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కిస్తున్న చిరంజీవి-వెంకీ!


