Tollywood: గతంలో ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే పేపర్, టీవీలపై ఆధారపడాల్సి వచ్చేంది. ప్రస్తుతం చేతిలో ఫోన్ ఉండి దానికి నెట్ ఉంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. ఫోన్ ఆన్‌చేస్తే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ల నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల కొంత మంచి జరుగుతున్నా.. ఎక్కువశాతం తప్పుడు ప్రచారం ప్రజల్లోకి చేరుతుంది. కొన్నిసార్లు కొందరు పనిగట్టుకొని వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తుండగా బాధితులు అవి తప్పుడు వార్తలు అని నిరూపించుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమవై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఇదే పరిస్థితి టాలీవుడ్‌లోని ఇద్దరు హీరోలకు ఎదురైంది. వరుసగా నాలుగు రోజుల నుండి ఆ ఇద్దరు హీరోలపై పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్ లలో తప్పుడు వార్తలు వస్తుండటంతో అవినిజమేనా, కాదా అని ఫోన్లుచేసి ఆరాతీసే శ్రేయేభిలాషులు, బంధువుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో నేరుగా ఇవి తప్పుడు వార్తలని వారు ఖండన ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
దగ్గుబాటి రానా. టాలీవుడ్‌లో ప్రముఖ హీరో. 2020 ఆగస్టు 8న రానాకు మిహీకతో వివాహమైంది. ఇటీవల రానా దంపతులు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఆమె కొంచెం బొద్దుగా కనిపించేసరికి అభిమానులు అంతా ఆమె ప్రెగ్నెంట్ అని అనుకున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారా అంటూ కామెంట్లు చేశారు. అయితే రాణా దంపతులు వీటిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కొన్ని యూట్యూబ్, వెబ్ సైట్లలో రాణా తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ప్రముఖులు, అభిమానులు రాణాకు విషెస్ చెబుతున్నారు.
దీంతో రానా తప్పనిపరిస్థితిలో తప్పుడు వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాను తండ్రిని కానున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇదంతా రూమర్ అని రానా క్లారిటీ ఇచ్చాడు. ఈ వదంతులు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని అన్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్‌సైతం సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీకాంత్, ఊహ భార్యాభర్తలు. టాలీవుడ్ లో వారిది ఎంతో అన్నోన్యమైన జంట. వారు విడాకులు తీసుకుంటున్నారంటూ పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరిగింది. గత వారం రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో విస్త్రతంగా సాగుతోంది.
శ్రీకాంత్, ఊహ విడాకులు అనేకసరి టాలీవుడ్ ప్రముఖులుసైతం కంగుతిన్నారు. దీంతో శ్రీకాంత్, ఊహలకు ఫోన్లు చేసి అసలు విషయం తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్ అభిమానులు, బంధువులు, మిత్రులు ఫోన్లు చేసి వందతులపై నిజానిజాలు తెలుసుకుంటున్నారు. ఈ ఇబ్బందిని తట్టుకోలేక పోయిన శ్రీకాంత్ ఓ నోట్ విడుదల చేశాడు. ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని, ఇవన్నీఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు. పనిలో పనిగా తమపై తప్పుడు వార్తలు రాసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరికలు సైతం చేశాడు.