Diya Suriya: సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు, కూతుళ్లు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ యాక్టింగ్‌లోకి అడుగుపెట్టడం కామన్‌గా కనిపిస్తుంది. ఇప్పుడున్న స్టార్ హీరోలు చాలా మంది వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినవారే. కానీ యంగ్ జనరేషన్ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలే షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
డాక్యుమెంటరీ మూవీ…
తాజాగా కోలీవుడ్ స్టార్స్ సూర్య, జ్యోతికల కూతురు దియా దర్శకురాలిగా మారింది. 17 ఏళ్ల వయసులోనే మెగా ఫోన్ పట్టిన దియా లీడింగ్ లైట్ పేరుతో ఓ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందింది. కూతురి షార్ట్ ఫిల్మ్‌ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య స్వయంగా నిర్మించారు.
Also Read – BSNL 4G: బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మోదీ.. ఈ రాష్ట్రాల్లోనే సేవలు.!
13 నిమిషాల రన్‌టైమ్…
బాలీవుడ్‌లో లైటింగ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న మహిళల జీవితాల్లోని కష్టాలను, సమస్యలను ఆవిష్కరిస్తూ లీడింగ్ లైట్ షార్ట్ ఫిల్మ్‌ను దియా తెరకెక్కించింది. ప్రియాంక సింగ్, లీనా గంగురే, హేటల్ డేద్దియా అనే ముగ్గురు మహిళా లైటింగ్ టెక్నీషియన్ల జీవన ప్రయాణం, వృత్తిలో వారికి ఎదురయ్యే సాధక బాధకాలను ఈ డాక్యుమెంటరీలో చూపించినట్లు తెలిసింది. 13 నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఉండబోతున్నట్లు సమాచారం.
ఆస్కార్ రేసులో…
ఈ షార్ట్ ఫిల్మ్‌ను తొలుత అమెరికాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో స్క్రీనింగ్‌కు అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఆస్కార్ అవార్డుల కోసమే ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. లాస్ ఏంజిలాస్‌లో లోని రెజెన్సీ థియేటర్‌లో ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను అక్టోబర్ 2 వరకు స్క్రీనింగ్ చేయబోతున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీలో లీడింగ్ లైట్ ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
తెలుగు డైరెక్టర్‌తో…
ప్రస్తుతం సూర్య కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. భారీ అంచనాల నడుమ రిలీజై అతడి గత సినిమాలు కంగువ, రెట్రో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం కరుప్పు మూవీతో బిజీగా ఉన్నాడు సూర్య. ఈ యాక్షన్ డ్రామా మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read – DEVARA 2 LATEST POSTER: దేవర 2 పోస్టర్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి దసరా కానుక!


