Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభHIT 2 : హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ షురూ..

HIT 2 : హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ షురూ..

శైలేష్ కొలను దర్శకత్వంలో.. అడివి శేష్,మీనాక్షి చౌదరి జంటగా డిసెంబర్ 2న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. హిట్ – ది ఫస్ట్ కేస్ తర్వాత.. వచ్చిన ఫ్రాంచైజీ మూవీ ఇది. తొలిరోజే ఊహించని రీతిలో వసూళ్లు రాబట్టి.. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా హిట్ 2 సినిమా ఆరున్నర కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ వసూళ్లతో కలిపి తొలిరోజు 11.27 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది. ఇక విడుదలైన రోజే.. తన ఓటీటీ పార్ట్నర్ ను కూడా లాక్ చేసుకుంది హిట్ 2. విడుదలైన నెలరోజుల తర్వాత ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తుందని సమాచారం. కాగా.. సూపర్ హిట్ దిశగా వెళ్తున్న హిట్ 2 టీమ్.. రేపు సాయంత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఇందుకు హైదరాబాదు ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోస్ గార్డెన్ వేదిక కానుంది. రేపు సాయంత్రం 6 గంటల నుండి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయని చెబుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News