Tuesday, October 8, 2024
Homeచిత్ర ప్రభRajamouli : హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కి మీరు క్లాసులు చెప్పాలి..

Rajamouli : హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కి మీరు క్లాసులు చెప్పాలి..

- Advertisement -

Rajamouli : RRR సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హాలీవుడ్ లో అంతా రాజమౌళి టేకింగ్ కి ఫిదా అయిపోయారు. RRR సినిమాని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా ప్రశంసిస్తున్నారు. ఇక రాజమౌళి హాలీవుడ్ లోనే ఉండి RRR సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆస్కార్ కోసం కష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాజమౌళి అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంటూ, హాలీవుడ్ ప్రముఖుల్ని కలుస్తున్నారు. హాలీవుడ్ మీడియాకి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా హాలీవుడ్ లో రాజమౌళిని ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతను RRR సినిమా గురించి రాజమౌళిని ఉద్దేశించి.. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి మీరు క్లాసులు చెప్పాలి. మార్వెల్ స్టూడియోస్ కి వెళ్లి మీరు క్లాసెస్ చెప్తే మంచిదేమో. మీ దగ్గర్నుంచి చాలా నేర్చుకోవాలి అని ప్రశంసించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News