Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభVijay Devarakonda : రౌడీ హీరో సినిమా ఆగిపోయిందా? సమంత వల్లేనా??

Vijay Devarakonda : రౌడీ హీరో సినిమా ఆగిపోయిందా? సమంత వల్లేనా??

- Advertisement -

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల కొన్ని నెలల క్రితం లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. భారీ అంచనాలతో రిలీజయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పొందింది. అప్పటిదాకా సినిమా ప్రమోషన్స్ లో ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన విజయ్ ఆ తర్వాత నుంచి కనపడటం కూడా మానేశాడు.

లైగర్ దెబ్బతో పూరి – విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. సుకుమార్ – విజయ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా పుష్ప 2 అయ్యేదాకా రాదు. అంటే ఇంకో సంవత్సరం పడుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఒక్క సినిమానే ఉంది. విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషీ సినిమా మాత్రమే విజయ్ చేతిలో ఉంది.

ఇప్పటికే ఈ సినిమా 40 శాతం వరకు షూట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. సమంతకి ఇటీవల మాయోసైటిస్ వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే. సమంత ఆ జబ్బుతో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. సమంత అనారోగ్యం వల్ల ఖుషీ సినిమా షూట్ ఆగినట్టు తెలుస్తుంది. సమంత షూట్ కి గ్యాప్ ఇవ్వడంతో ఖుషీ సినిమా షూట్ ఆగిపోవడంతో విజయ్ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. మరి ఈ సినిమా తిరిగి మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News