Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభSukumar: సినిమాలు ఆపేస్తాను.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్

Sukumar: సినిమాలు ఆపేస్తాను.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్

తెలుగు దర్శకుడు సుకుమార్(Sukumar) ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన క్రియేటివిటీతో సినిమాలు తెరకెక్కించే సుకుమార్ చేసిన షాకింగ్ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ‌త ఆదివారం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజ‌ర్'(Game Changer) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డ‌ల్లాస్‌లో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా యాంకర్ సుమ.. సుకుమార్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘దోప్‌’ అనే పదంతో ఒకటి వదిలేయాల్సి వస్తే మీరు ఏం వదిలేస్తారు అని ప్రశ్నించారు. ఇందుకు సుక్కు సమాధానమిస్తూ సినిమాలు చేయడం మానేస్తాను అని తెలిపారు. ఆ వెంటనే చెర్రీ మైక్ లాక్కొని “లేదండి.. ఈయ‌న గ‌త కొన్నేళ్లుగా ఇలాగే అంద‌రినీ భ‌య‌పెడుతున్నారు. అది జ‌రిగేది కాదు” అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా సుకుమార్ తన తర్వాతి సినిమాను చరణ్‌తో లేదా విజయ్ దేవరకొండతో తీయనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News