Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభOG Movie Tickets: ఓజీ మేక‌ర్స్ క‌ష్టాలు.. టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ.. ఇదేందయ్యా ఇది!

OG Movie Tickets: ఓజీ మేక‌ర్స్ క‌ష్టాలు.. టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ.. ఇదేందయ్యా ఇది!

OG Movie Tickets: సాధారణంగా, ఒక సినిమాను ప్రేక్షకులలోకి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి చిత్ర బృందాలు వివిధ రకాల ప్రమోషనల్ స్ట్రాట‌జీస్‌ను యూజ్ చేస్తుంటాయి. ఇలాంటి డిఫ‌రెంట్ స్ట్రాట‌జీస్‌తో మూవీని మ‌రింత‌గా ఆడియెన్స్‌కు చేరువ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కొంతమంది టికెట్ల రేట్లు తగ్గించడం చేస్తే మ‌రికొంత మంది 1+1 ఆఫర్ పెట్టడం వంటి పనులను కూడా చేయ‌టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ యాక్ష‌న్ మూవీ OG కోసం మేక‌ర్స్ అలాంటి ప్ర‌య‌త్నాల‌నే చేస్తున్నారు. అందులో బాగంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఓజీ’ సినిమా టికెట్ కొనుగోలు చేస్తే మినీ బిర్యానీ ప్యాక్ ఉచితం అంటూ చేసిన ప్రకటన ఆడియన్స్‌కి కొంత సంతోషాన్ని కలిగించినా, ఇది పవన్ కళ్యాణ్ పై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పవన్ కళ్యాణ్, సుజిత్ (Sujeeth) కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన చిత్రం OG. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదల తేదీ కంటే ఒక రోజు ముందుగానే పెద్ద ఎత్తున ప్రీమియర్స్ పడిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ చిత్రం మొదటి రోజే రూ. 154 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే మొదట్లో బాగానే కలెక్షన్లు రాబట్టినప్పటికీ, ఇప్పుడు రోజు రోజుకి కలెక్షన్లు పడిపోతున్నాయి.

Also Read- Mirai US Collections: ఓవర్సీస్‌లో ‘మిరాయ్’ మిరాకిల్.. ప్రభాస్, ఎన్టీఆర్ సరసన చేరిన తేజ సజ్జా

‘ఓజీ’ టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ ఆఫర్ వివరాలు
కలెక్షన్లు రోజురోజుకీ పడిపోతున్న ఈ సమయంలోనే మేకర్స్ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. OG టికెట్‌ను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ (District by Zomato)లో కొనుగోలు చేస్తే ప్యారడైజ్ (Paradise) నుండి మినీ బిర్యానీ ప్యాక్ ఫ్రీగా పొందవచ్చు అంటూ చిత్ర బృందం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

క్రేజ్ తగ్గిపోతోందా?
పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి ఆఫర్ ప్రకటించడంపై ఆడియన్స్, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా బాబు’ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి, పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు అంటేనే అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా థియేటర్ కి క్యూ కడతారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకంగా పూర్తి సినిమా చేసినా ఆయన సినిమా చూడడానికి ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడంతో ఇలాంటి ఆఫర్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మూవీకి ఇలాంటి తిప్పలు ఎవరు ఊహించలేనివి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి ఆఫర్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ పై ఈమధ్య క్రేజ్ తగ్గుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కంటెంట్ కోసమే ఆరాటపడుతున్న ఆడియన్స్‌కి ఇప్పుడు హీరో ఎవరన్నది పట్టింపు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓజీ సినిమాకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్‌పై చర్చ మొదలైంది.

Also Read- Sobhita Dhulipala: అక్కినేని మాజీ కోడలిపై శోభిత షాకింగ్ కామెంట్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad