Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi: నాని సమర్పణలో.. మరో క్రేజీ ప్రాజెక్టుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్

Chiranjeevi: నాని సమర్పణలో.. మరో క్రేజీ ప్రాజెక్టుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్

Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యువ దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న మెగాస్టార్.. తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించునున్నారు.

- Advertisement -

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వివరాలు తెలియజేస్తూ నాని షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చిరంజీవి చేతిని చూపించారు. హింసలోనే అతడు శాంతిని వెతుక్కుంటాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

‘‘ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఎదిగాను. ఆయన సినిమాల కోసం గంటలతరబడి క్యూలైన్‌లలో వేచి చూశా. ఆఖరికి నా సైకిల్‌ కూడా పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదేనేమో. మెగాస్టార్‌ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో ఆ కల సాకారం కాబోతోంది’’ అని నాని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రం రూపుదిద్దకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad