Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభAvatar2 Advance Booking: అవ‌తార్ -2 దెబ్బ‌కు చిన్న‌బోతున్న ఇండియ‌న్ సినిమా రికార్డ్స్..

Avatar2 Advance Booking: అవ‌తార్ -2 దెబ్బ‌కు చిన్న‌బోతున్న ఇండియ‌న్ సినిమా రికార్డ్స్..

Avatar2 Advance Booking: 2009లో ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్ త‌న అద్భుత ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో సినీ ప్రేక్ష‌కుల‌కు అవ‌తార్ రూపంలో మ‌రో ప్ర‌పంచాన్ని చూపించారు. అవ‌తార్ సినిమాను ఇప్ప‌టికీ సినీ ప్రేమికులు మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో దాదాపు ప‌ద‌మూడేళ్ల త‌రువాత అవ‌తార్‌కు సీక్వెల్ తో జేమ్స్ కామెరాన్ వ‌చ్చేస్తున్నాడు. అవ‌తార్‌-2 సినిమా 16న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన టైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. మంచి ఆద‌ర‌ణ పొందింది.

- Advertisement -

అవ‌తార్‌-2 సినిమా ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తుడిపేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే గ‌తంలో ఇండియ‌న్ సినిమాలు సృష్టించిన రికార్డులు చిన్న‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ సినిమాతో కేజీఎప్‌-2 రికార్డు క‌నుమ‌రుగైంది. భార‌త్‌లో అవ‌తార్‌-2 సినిమా ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ రూ.30 నుంచి 40కోట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌తార్ -2 మూవీకోసం 4,41,960 మంది భార‌త్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంకా గురువారం సాయంత్రం వ‌ర‌కు వీటి లెక్క భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

భార‌త్‌లో కేజీఎఫ్‌-2కి 4,11,000 మంది, బ్ర‌హ్మ‌స్త్రం సినిమాకు 3,02,000, దృశ్యం-2 సినిమాకు 1,16,000, ఆర్‌ఆర్ఆర్ సినిమా 1,05,000 టెకెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. అయితే గురువారం సాయంత్రంకు వీటి సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. అయితే, భార‌త్‌లో రూ. వంద‌కోట్లు క‌లెక్ట్ చేయాల‌నేది అవ‌తార్‌-2 టార్గెట్ గా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News