Sunday, November 16, 2025
HomeTop StoriesRukmini Vasanth: రష్మికని రుక్మిణి రీప్లేస్ చేస్తుందా?

Rukmini Vasanth: రష్మికని రుక్మిణి రీప్లేస్ చేస్తుందా?

Rukmini Vasanth: రుక్మిణి వసంత్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సప్తసాగరాలు దాటి సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలలో అడుగుపెట్టింది ఈ బ్యూటి. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అందం, అభినయంతో పాటు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే లక్ కూడా బాగా ఫేవర్ చేయాలి.

- Advertisement -

రుక్మిణి వసంత్ కి అలా అన్నీ కలిసొస్తున్నాయి. రెండవ సినిమా మదరాసి కూడా మంచి హిట్ సాధించింది. దాంతో సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ బ్యూటీపై కన్నేశారు. అలా వరుసగా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన హీరో రిషబ్ శెట్టి. కన్నడ ఇండస్ట్రీలో యష్ తర్వాత మళ్ళీ రిషబ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయ్యాడు. అలా కాంతార ప్రీక్వెల్ సినిమాను ఆయనే నటిస్తూ డైరెక్ట్ చేశారు.

Also Read – K-RAMP: మాస్ అవతార్‌లో కిరణ్ అబ్బవరం: యూత్‌ని ఉర్రూతలూగించడానికి ‘K-Ramp’ సిద్ధం!

ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించింది. మొదటి భాగం మాదిరిగానే, ప్రీక్వెల్ మూవీకి హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతున్న కాంతార 1 ఎక్కువగా మాట్లాడుకుంటుంది… రిషబ్ అండ్ రుక్మిణి గురించే. క్లైమాక్స్ కోసం రిషబ్ ప్రాణం పెట్టారని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అలాగే, అందంతో పాటు మంచి నటనను కనబరిచిన హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో ఒకరకంగా ఈ బ్యూటీ నేషనల్ క్రష్ గా మారిపోయింది.

ఇప్పటివరకూ రష్మిక మందన్ననే అందరూ నేషనల్ క్రష్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ని రుక్మిణి వసంత్ రీప్లేస్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కాంతార లాంటి పాన్ ఇండియా సినిమా ప్రీక్వెల్ అంటే మార్కెట్ ప్రకారం రష్మికని తీసుకొని ఉండొచ్చు. అలాగే, ప్రశాంత్ నీల్, ఎన్‌టిర్ కాంబోలో వస్తున్న సినిమాలోనూ రష్మికని తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ, ఆమెని కాదని రుక్మిణి వసంత్ వైపే మొగ్గు చూపారు. దీంతో రానున్న రోజుల్లో గ్యారెంటీగా రష్మికని రుక్మిణి రీప్లేస్ చేస్తుందేమో అని టాక్ మొదలైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read – Nidhhi Agerwal: పవర్ స్టార్ మాటలు నన్ను హత్తుకున్నాయి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad